కలికాలం_బాల పంచపదులు;- కాటేగారు పాండురంగ విఠల్ హైదరాబాద్
ఉన్నమాటంటే ఉలికి పడును
తప్పంటే తప్పు పట్టు కొనును
చేసిన మేలు మరచి పోవును
దుష్ప్రచారం మొదలు పెట్టును
ధూర్తుల లక్షనమిదియేగా విఠల!

కుక్క తోకను సరి చేయలేము
మూర్ఖుల మనసు మార్చలేము
దుష్టులకు దూరంగా ఉండుము
అందరూ మంచోళ్లనుకోకుము
మనుషులందు చీడపురుగు వేరు విఠల!

మనపై చూపే ప్రేమాభిమానము
అప్పటి వరకున్న మమకారము
చూపిన అమితమైన గౌరవము 
క్షణంలో అవును మటుమాయము
నీవు నీచుణ్ణి నీచూడనంటే విఠల!

నిజం చెబితే శత్రువులవుతారు
నీతి బోధించితే నికృష్టులంటారు
నిజాయితీని నిందిస్తూ వుంటారు
నిందించినచో నిన్నిక వదలరు
నీచుల సహజ గుణమీదే విఠల!

కాలికాలం మనుషుల తీరు వేరు
కడు విచిత్రం!గమనించాలి మీరు
పాలు నీళ్ళను వేరుచేయాలి మీరు
హంసలా మెలగాలి ప్రతి ఒక్కరు
లేదంటే అవస్థలు తప్పవుగా విఠల!

కామెంట్‌లు