శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది -ఎం. వి. ఉమాదేవి
121)వరారోహః -

వరములను అధిష్టించువాడు
జ్ఞానగమ్యం చూపించువాడు
తపోధనులైన భక్తులున్నవాడు
జ్ఞానముతో నిండియున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
122) మహా తపాః -

నిరంతర తపసుగలవాడు
మహాధ్బుత జ్ఞానమున్నవాడు
సాధకుల యందున్నవాడు
ధ్యానమునీయ గలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
123)సర్వగః -

సర్వత్రా వ్యాపించియున్నవాడు
సర్వలోకగమనమున్నవాడు
అంతటా సంచారమైనవాడు
లోకములు చుట్టివచ్చువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
124)సర్వవిద్భానుః -

సర్వమును తెలిసినట్టివాడు
బుద్ధిని కలుగజేయువాడు
జ్ఞానముకు బీజమువేయువాడు
మేధను అందించునట్టివాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
125)విష్వక్సేనః -

అసురసేనాధ్వంశియైనవాడు
రాక్షసగణములనోడించువాడు
దైత్యులని భయపెట్టగలవాడు
అసురులను పారద్రోలేవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు