బోసి గ్రామాన్ని సందర్శించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర కమిటీ సభ్యులు

 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర ముధోల్ నియోజకవర్గం గ్రంథ రచయిత కమిటీ రచయితలు జాదవ్ పుండలిక్ రావు పాటిల్, సోమ జనార్దన్ రెడ్డి ఆదివారం తానూర్ మండలంలోని బోసి గ్రామాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గౌడ్ పాల్గొని ముధోల్ నియోజకవర్గం లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల చరిత్ర గ్రంథస్థం చేయటానికి ఉద్యమకారుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారులు తమ వివరాలను రచయితలకు లిఖితపూర్వకంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోసి గ్రామంలో ఉద్యమంలో పాల్గొన్న నక్కల మోహన్ గౌడ్, చాదల భోజన్న, తుంగెన శంకర్, గాడే శికరప్ప, భామన్ రాఘవులు, జి రామ్నాథ్, మోత్కూరి వెంకట కిష్టయ్య , నాగేష్ తోపాటు పలువురు ఉద్యమకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 
కామెంట్‌లు