నిశ్చలమైన నీటివంటి
అంతరంగంతో
వేదనలూ వేడుకలూ
సమానంగా
ఆనందాల పొంగు లేక
ఆవేదనలో కుంగు లేక
కదులుతున్న ప్రతిక్షణం
అచ్చంగా అనుభవిస్తే
మనదన్నది మన వద్దకు
వచ్చి చేరే తీరుతుంది
మనది కానిది పట్టుకున్నా
జారిపోదా! బంధమైనా కాలంలా
గతమెన్నడు మార్చలేము
రేపేమిటో తెలుసుకోలేము
ఇప్పటి క్షణమే మనదనుకుని
ఎలాగోలా బ్రతికేయక జీవిద్దాం
తెలియకనే పడిన
చిక్కుముళ్ళన్నీ సులువుగ
దేనికదే విడిపోయి
విస్తుపోయేలా చేసే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి