ఎవరో
చేస్తున్నట్లున్నది
కనికట్టును
విచిత్రాలను
ఎవరో
తిప్పుతున్నట్లున్నది
కాలచక్రాన్ని
భూగోళాన్ని
ఎవరో
ఆడిస్తున్నట్లున్నది
తెరలేని
నాటకాన్ని
ఎవరో
నాటినట్లున్నది
విత్తనాలను
మొక్కలను
ఎవరో
చేతికిచ్చినట్లున్నది
పువ్వులను
కాయలను
ఎవరో
వెలిగిస్తున్నట్లున్నది
సూర్యుడిని
చంద్రుడిని
ఎవరో
ప్రేమకురిపిస్తున్నట్లున్నది
అమ్మానాన్నలనిచ్చి
భార్యాబిడ్డలనిచ్చి
ఎవరో
పిలుస్తున్నట్లున్నది
తియ్యగా
ప్రేమగా
ఎవరో
నడిపిస్తున్నట్లున్నది
ఎత్తుకు
ముందుకు
ఎవరో
ప్రక్కనున్నట్లున్నది
అండగా
తోడుగా
ఎవరో
నవ్వుతున్నట్లున్నది
పకపకా
ప్రకాశంగా
ఎవరో
వెలిగించుతున్నట్లున్నది
మోములను
మదులను
అంతా
కనిపిస్తున్నట్లున్నది
కొత్తగా
అందంగా
అందరూ
అగుపిస్తున్నట్లున్నది
మంచిగా
ముచ్చటగా
అన్నీ
మురిపిస్తున్నట్లున్నది
మేనును
మనసును
యావత్తు
తెలిసినట్లున్నది
క్షుణ్ణంగా
సమగ్రంగా
సర్వం
తానయినవాడికి
ప్రార్ధనలు
ప్రణామాలు
ఎవరో
తెలుసుకోండి
ఎందుకో
ఆలోచించండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి