ఆకట్టుకునే వాకిలికి అందమైన ముగ్గులు ; -లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్-చెన్నై
"సంక్రాంతి, ధనుర్మాస ముగ్గుల విశిష్టత -
ముగ్గులు మనకు  నేర్పుతున్న జీవిత పాఠాలు"

దక్షిణాది వారైనా తెలుగు, తమిళ,కన్నడ ,మలయాళీల దిన చర్య ప్రతిరోజు  ముగ్గుతోనే మొదలవుతుంది.

నాకనిపిస్తుంది ఆడవారి ముఖానికి బొట్టు ఎంత అందమో..
ప్రతి ఇంటి ముంగిట ముగ్గు కూడా అంతే అందాన్ని ఇస్తుంది అని...

ప్రతి రోజు నేనే గుమ్మం ముందు ఊడ్చి,నీళ్ళు చల్లి చిన్నదో పెద్దదో ఒక ముగ్గు వేస్తాను.
ముగ్గు వేయడం ఒక మంచి కళ అనిపిస్తుంది నాకు. 
ముగ్గు వేయడానికి ముందు ముగ్గు అంటే ఆసక్తి,వేయాలనే తపన ఉండాలి .
ముగ్గుని కష్టపడి కాకుండా  ఇష్టపడి వేయాలి.

దృష్టి వేసే ముగ్గుపైనే ఉండాలి...
వేసేప్పుడు ఎంతో ఏకాగ్రత ఉండాలి....
అప్పుడు ముగ్గు బాగా వేయగలం ,వేసిన ముగ్గుని చూసి సంతోషించగలం.

ముగ్గు వేస్తున్నంత సేపు చుక్కల మీద,మెలికల ముగ్గు( కాస్త ఏకాగ్రత ఎక్కువ ఉండాలి),గీతల ముగ్గు,కేవలం డిజైన్స్ అయినా తప్పు రాకుండా గమనిస్తూ వేయాలి...
మాయాబజార్ సినిమాలోలాగా ఎవరూ పుట్టించకుంటే మాటలెలా పుడతాయి అన్నట్టు కొత్త ముగ్గులు మనమే కనిపెట్టాలి.
ముగ్గులు మనలోని సృజనాత్మకను బయిటికి తీస్తాయి.
రకరకాలుగా వేసే విధంగా ఆలోచించెట్టు చేస్తుంది..
చివరికి అందమైన ముగ్గు వేసాక ,ఒక గొప్ప సంతృప్తి కలుగుతుంది. దాని వల్ల మనసుకి ఆనందంగా అనిపిస్తుంది.

ముగ్గు వేయడం వల్ల ఒక పని పట్ల ఆసక్తి,తపన,ఏకాగ్రత,ఇష్టం,సహనం,
సృజనాత్మక మొదలైనవి మనకు అబ్బి మన జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుంది.
ఇవన్నీ మన జీవితంలో అవసరమయే,నేర్చుకునే పాఠాలే.
సూర్యోదయపు లేలేత సూర్యకిరణాలు ముగ్గువేస్తున్న మనమీద పడతాయి ఆ కిరణాల ద్వారా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఆ లేలేత సూర్యకిరణాలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి మనకు. అంతే కాదు ముగ్గు వేస్తున్నంత సేపు మనం వంగుతూ లేస్తూ ఉంటాము అది మనకు మంచి శారీరక వ్యాయామం.అందుకే పూర్వకాలం లో మహిళలందరు చక్కగా ఉదయాన్నే ముగ్గు వేసేవారు ఆరోగ్యం గా వుండేవారు. కాళ్ళ నొప్పులు,నడుము నొప్పి అని ఎప్పుడు బాధ పడలేదు. ప్రస్తుతం మహిళలు ముగ్గులు వేయడమే అరుదు అయి జబ్బుల బారిన పడుతున్నారు. పెద్దలు బియ్యంపిండి  ముగ్గు పిండిలో కలిపి ముగ్గు వేయమనే వారు.దానికి కారణం. చీమల్లాంటి చిన్న ప్రాణులకు ఆ బియ్యం పిండి ఆహారంగా దొరకాలని. ఎంత మంచి ఆలోచన ఇది.

 చివరగా నేను చెప్పొచ్చేదేంటంటే మనకు  తెలియని కంప్యూటర్,జ్యోతిష్యం,మొబైల్ వాడటం,టెక్నాలజీ అన్ని సులువుగా నేర్చేసుకుంటున్నాము కద!
.అలాగే,
స్త్రీలందరు సమయాన్ని బట్టి మనకు తోచిన ముగ్గుని రోజు వేసుకుంటే ఉదయాన్నే మంచి వ్యాయామం,మెదడుకు మేత, సూర్యకిరణాలు పడి ముఖ్యంగా ఆరోగ్యం బావుంటుంది😊...
అందమైన ముగ్గు లాంటి జీవితం మనదవుతుంది😊😊🙏






కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం