బంగారు తల్లి ;- తాయారు
ఆడపిల్లవే, కళకళలాడే
కలకలనవ్వేవెలుగుల దివ్వెవి
శిరులతల్లి, ప్రతి రూపానివి
కారణజన్మవు,కావ్య నాయకవు

మమతలు పంచే మానినివి
వీరోచిత ధీరోచిత కార్యాల
చక్కదిద్ధు సమయోచిత
మహావీరవనితవు,వజ్రానివి

నిన్ను కించ పరచ దేవతలకే
అవమానం,మానాభిమానాలు
కాపాడు మహిలో శక్తి స్వరూపిణి
నీకేమి తక్కువ తల్లీ,అందరి

ఆశీస్సులు పొందుగ పొందే
సకల సుగుణాల రాశి చిన్ని తల్లి
అందరి తలలో నాలిక వై అందక
ప్రలోభాలకు,అంకిత మనసున

ముందడుగు వేయి ముద్దుల
మురిపాల లావణ్య రూపమా
పూరించు నీ విజయశంఖం
దిక్కులు పిక్కటిల్ల,గుండెలు

దడదడలాడ,నీ పాద కడియాల
శబ్ద తరంగాలు,హృదయాలు
దద్దరిల్ల నడచిరా వేవేగ,నవ్య
నూతన మహాదివ్య రూపమా !!!
🪷🌻🍇🎈🍀🎉🌻🪷


కామెంట్‌లు