న్యాయాలు -378
అతి పరిచయ న్యాయము
******
అతి అంటే ఎక్కువ. పరిచయం అంటే దగ్గరితనం.
అతి పరిచయము వలన అవజ్ఞ అనగా అవమానము,తిరస్కారము కలుగుతుంది.
అతి పరిచయము అనంతరం జరిగే అనర్ధాలు, పరిణామాలు ఏమిటో తెలిపే సుభాషిత రత్నావళి లోని ఈ శ్లోకాన్ని చూద్దామా...
అతి పరిచయాదవజ్ఞతా సన్త తగమ నాదనాదరోభవతి!/మలయే భిల్ల పురన్ధ్రీ చన్దనతరుకాష్ఠ మిన్ధనం కురుతే!!/
అతిగా పరిచయము అనేది అనాసక్తి మరియు అవిధేయతకు దారి తీస్తుంది.భిల్ల జాతి ఆటవిక స్త్రీలు గంధపు చెట్టు కొమ్మలను వంట చెరకుగా ఉపయోగిస్తుంటారు.ఎంతో విలువైన గంధపు చెక్కకు అందాల్సిన గౌరవం అందలేదు.నిరాదరణకు గురై చివరికి వంట చెరకుగా మారింది. కారణం మలయ పర్వతాల్లో మంచి గంధపు చెట్లు ఎక్కువగా ఉన్నందున ఆ ప్రాంతంలో నివసించే స్త్రీలు మామూలు వంట చెరకుకు బదులుగా గంధపు చెట్ల కొమ్మలను వాడుతుంటారు.
ఇక్కడ గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే అతిగా దొరకడంతో దాని యొక్క గొప్పతనం గుర్తించకపోవడం అన్నమాట.
అలాగే దీనికి సంబంధించిన మరో శ్లోకాన్ని కూడా చూద్దాం.
"అతి పరిచయాదవజ్ఞా భవతి విశిష్టేపి వస్తుని ప్రాయః!/లోకః ప్రయాగ వాసీ నిత్యం కూపే స్నానం సమాచరతి!!"
ఇది కూడా పై విధమైన అర్థాన్నే ఇస్తుంది.అతి పరిచయం వల్ల విశేషమైన విషయాలు కూడా తిరస్కారానికి గురవుతుంటాయి.అదెలా అంటే ప్రయాగలోని ప్రజలు రోజూ బావిలో నీళ్ళతో స్నానం చేయడం లాంటిది. ప్రయాగలో ప్రవహించే గంగానది చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు.అలాంటి ఔన్నత్యానికి,పాపం రాహిత్యానికి మూలమైన గంగానదిని చాలా తేలిక దృష్టితో, చులకన భావంతో చూస్తూ అన్ని అవసరాలకు ఉపయోగించుకోవడమన్న మాట.
అంటే అతి పరిచయము వల్ల ఎంతో ఉన్నతంగా చూడాల్సినవి చులకనగా చూడబడ్డాయి. కేవలం గంగానది నీళ్ళో, గంధపు చెక్కలో కావు. మనుషుల్లో కూడ అతి పరిచయము వల్ల కొన్ని మార్పులు వస్తుంటాయి.
బయట ఎంత గొప్ప వ్యక్తులు అయినా పదే పదే ఒకరింటికి ఒకరు రావడం మూలానా గౌరవ మర్యాదలు తగ్గిపోతుంటాయి.
ఇంకా కొందరు స్నేహం పేరుతో వ్యక్తి హోదాను స్థాయిని పక్కకు పెట్టి అరేయ్, ఒరేయ్ అనుకుంటూ ఉంటారు. అంత వరకు బాగానే వుంటుంది కానీ కొంతమంది అతి చనువు తీసుకుని అధికంగా మాట్లాడటం,పిలుపులో అమర్యాద, తేలిక భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. దీనినే అతి పరిచయము వల్ల వచ్చే చేటు లేదా అనర్ధమని చెప్పుకోవచ్చు.
"పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అన్నట్లు" అతి దగ్గరితనం ఇలాంటి సంఘటనలకు దారి తీస్తుంది.
అందుకే మన పెద్దలు "అతి సర్వత్ర వర్జయేత్" అని ఓ మాట కూడా అన్నారు.
అందుకే పనుల విషయంలో,మాటల విషయంలో అవసరమైనంత మేరకు మాత్రమే చేయాలి.మాట్లాడాలి.అతి చేయకూడదు.చేసి అవమానాల పాలు కాకూడదు.
మరి కొందరైతే అతి పరిచయము వల్ల తమతో తప్ప ఇతరులు ఎవరితో మాట్లాడినా ఒప్పుకోరు. అంటే ఒక రకంగా స్వార్థం అన్నమాట.
ముఖ్యంగా మనలో మార్పు రావాలి.అతి పరిచయం వల్ల అనర్థాలు జరుగకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్ల కుండా చూసుకోవాలి.
ఇదే "అతి పరిచయ న్యాయము"అంటే.దీని ద్వారా మనం ఎన్నో జీవితానుభవాలను తెలుసుకున్న విషయాలు విశేషాలు.
వీటిని సదా గమనంలో పెట్టుకొని మన స్థాయికి, గౌరవానికి భంగం వాటిల్లకుండా,అలాగే ఇతరులకూ యిబ్బంది కలగకుండా చూసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి