విఠల్ పంత్! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆపేగావ్ అనే పల్లెలో నిరుబాయి గోవిందపంత్ అనే దంపతులకు విఠల్ పంత్ జన్మించారు.బాల్యంనుంచీ దైవభక్తి ఉన్న వాడు.పెళ్ళి చేయాలని తండ్రి ప్రయత్నం చేశాడు.అది ఇష్టం లేని విఠల్ తీర్థయాత్రలు చేస్తూ పూనా దగ్గర ఉన్న ఆలంది అనే పుణ్య క్షేత్రం కి వచ్చాడు.అక్కడ సిద్ధోపంత్ అనే భక్తుడు కల్సి తన ఇంటికి తీసుకుని వెళ్లాడు.సిద్ధోకి  పాండురంగడు కల్లో కన్పించి " నీకూతురు రుక్మాబాయిని విఠల్ కిచ్చి పెళ్లి చేయి" అని ఆదేశించాడు.దేవుడు విఠల్ కి కూడా కలలో కనిపించి " నీవు రుక్మాబాయిని పెళ్ళాడు" అని ఆదేశించాడు.అలా అతని పెళ్లి జరిగింది.సంతానం కల్గలేదు.విరక్తితో చెప్పకుండా కాశీకెళ్ళాడు.రామానందుని శిష్యుడు గా సన్యాసి గా మారాడు.కానీ పెళ్లి ఐనట్లు చెప్పలేదు.విఠల్ కి బాధ్యత అప్పగించి రామానందస్వామి తీర్థయాత్రలు చేస్తూ ఆలందికి వచ్చాడు.సిద్ధోపంత్ కూతురు రుక్మాబాయిని తీసుకుని స్వామి ని దర్శించాడు. విఠల్ పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్పిన విషయం తెలుసుకున్న ఆయన తండ్రి కూతురు ని తీసుకుని కాశీకి వెళ్ళి విఠల్ తో" నీవు రుక్మాబాయిని భార్య గా స్వీకరించాలి" అని పంపేశాడు.కానీ ఆదంపతులను సమాజం వెలివేసింది.అడవిలో జీవిస్తూ ముగ్గురు కొడుకులు ఓకూతురుకి జన్మనిచ్చారు.వారూ పాండురంగని భక్తులై తరించారు.విఠల్ రుక్మాబాయి ఆఖరి దశలో అలహాబాద్ త్రివేణి సంగమంలో తనువు చాలించారు.సన్యాసి తిరిగి భార్యతో సంసారం చేసి 4గురు పిల్లల్ని కనడం నేరం అపరాధం .అందుకే సమాజంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా నలుగురు పిల్లలు గొప్ప భక్తులుగా చరిత్రలో నిల్చారు🌷
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం