ఆధ్యాత్మికత;- సి.హెచ్.ప్రతాప్
 ఆధ్యాత్మికత అన్న పదానికి వేద శాస్త్రాలు ఇచ్చిన నిర్వచనం :
1. నిర్మలమైన హృదయం తో , పవిత్ర జీవనం కొనసాగించడం.
2. సకల జీవ రాసులలో భగవంతుని దర్శించగలగడం.
3. భగవంతునికి సంపూర్ణ , సర్వశ్య శరణాగతి చేసి  ప్రసాద భావంతో జీవించడం.
4. గురువులు, తల్లిదండ్రులు , వయస్సులో పెద్దల యందు గౌరవాభిమానములు కలిగి వుండడం.
5. సర్వ జీవ సమానత్వం భావనను ఆచరణలో పెట్టడం.
6. అత్యున్నత విలువలు,నీతి నియమాలు, నియమ నిష్టలతో , నిరంతరం ధర్మాచరణ ఒనరించడం.
7. కోరికలనే గుర్రాలను అదుపులో వుంచుకోవడం.
8. వేద,శాస్త్ర సమ్మతమైన కార్యములను మాత్రమే చేయడం.
ఎప్పుడైతే ఈ మతచాందస వాదుల కట్టుబాట్లను వదిలి ముందుకు సాగుతాడో అప్పుడే సాధకునికి  ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముక్తి మార్గానికి బాట ఈ ఆధ్యాత్మిక చింతన. దీనిని కూడా దాటితేనే ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోగలము. ఈ దశ ఉన్నతమైనది. ఈ లక్ష్యాన్ని సాధిస్తే జీవితం సార్థకమవుతుంది.
చెడును వదిలి మంచిని పొందడాన్ని మతం అని, ఆత్మను తెలుసుకోవడాన్ని ఆధ్యాత్మికత అని అంటారు. ఒక వ్యక్తి తాత్కాలిక విషయాల కోసం కామం నుండి బయటికి వచ్చి శాశ్వతమైన ఆత్మను తెలుసుకున్నప్పుడు, అది ఆధ్యాత్మికతకు నాందిని సూచిస్తుంది.ధ్యాత్మికత మనకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది . ఇది స్వచ్ఛమైన, మీ ఆత్మ (నిజమైన ఆత్మ) జ్ఞానాన్ని అందిస్తుంది. ఇది మంచి మరియు చెడు పనులకు అతీతంగా మరియు స్వచ్ఛమైన ఆత్మ యొక్క ఎప్పటికీ క్షీణించని ఆనందంలో ఉండాలని బోధిస్తుంది. ఇది జనన మరణ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. 

కామెంట్‌లు