శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
171)మహోత్సాహః -

ఉత్సాహముతో నుండెడివాడు
కార్యక్రమసిద్ధి గలిగినవాడు
జ్ఞానవంతుడు తానైనవాడు
ఉత్సాహమునందించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
172) మహాబలః -

బలవంతుల్లో శ్రేష్టుడైనవాడు
మహాశక్తి సంపన్నుడైనవాడు
బలమును ప్రసాదించువాడు
విశ్వబలమును తానైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
173)మహాబుద్ధిః -

తెలివితేటలున్నట్టి వాడు
బుద్ధిని ప్రసాదించువాడు
జ్ఞానమునీయగలవాడు
గొప్ప మేధతో నున్నవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
174)మహావీర్యః -

బ్రహ్మాండ సృజనజేయువాడు
విద్య తాపసశక్తియున్నవాడు
ప్రాణులకు కారకుడైనవాడు
సృష్టికర్తగా నిలబడువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
175)మహాశక్తిః -

శక్తి సంపన్నతగలవాడు
సమర్థుడు అయినట్టివాడు
మహాబలముగలిగినవాడు
శక్తిరూపం పొందినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు