మనం ఆపద కష్టాల్లో ఉన్నప్పుడు నీకు నేనున్నాను భయంలేదు అనే ఆపన్నహస్తం కావాలి.బాల్యంలో అమ్మ నాన్నలు అమ్మమ్మ బామ్మ తాతలు ఆపై భార్యాభర్తలు పిల్లలు బంధువులు స్నేహితులు మనం బాధల్లో ఉంటే ఓదార్చి ధైర్యం చెప్తారు.అలా పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వ్యాసమహర్షి ఎందరో మునులు ఋషులు ధైర్యం మనోబలం కల్గించే వారు.అలాంటి ఋషి బృహదర్శుడు.కామ్యకవనంలో ధర్మరాజు ని కల్సి ఎంతో ధైర్యాన్ని నూరిపోస్తాడు.నలుడి కథ చెప్పాడు.ఆకథ ధర్మరాజు జీవితం దాదాపు ఒకే రకంగా నడిచింది." ధర్మరాజా! నీకన్నా ఎక్కువ కష్టనష్టాలు అనుభవించాడు నలమహారాజు.ఆయన పినతండ్రి కొడుకు పుష్కరుడు.నలుని రాజ్యం కాజేస్తాడు కపటజూదంలో. ఆపాచికల్లో కలిపురుషుడు ఉండటంతో సర్వస్వం కోల్పోయిన నలుడు పిల్లల్ని అత్తారింటికి పంపి భార్య దమయంతి తో అడవిలో తిరిగాడు.ఆకలిమంటకు తాళలేక పైన ఎగిరే హంసలపై తన వస్త్రాలను విసిరాడు అవి కింద పడితే తినొచ్చు అని.కానీ ఆబట్టల్ని అవి తమతో తీసుకుని పోయాయి.భార్య చీర కొంగు చింపి మొలకి చుట్టుకున్నాడు. అర్ధరాత్రి ఒంటరిగా భార్య ను వదిలి వెల్తుంటే పాముకాటేసింది. నల్లగా పొట్టిగా వంకర పోయిన కాళ్లు చేతులతో కురూపిగా మారాడు.అంతటి మారాజు ఋతుపర్ణుడు అనే రాజు దగ్గర వంటవాడిగా చేరాడు.ధర్మరాజా! నీవు చక్కగా భార్య తమ్ముళ్ళతో ఉంటున్నావు.అక్షయపాత్రతో ఆహార కొరత లేదు.యాగాలతో కాలక్షేపం చేస్తున్నావు.ఇంక నీకేం లోటు? ఎందుకు దిగులు బెంగ అని చక్కగా ధైర్యం చెప్పాడు.మన కన్నా ఎక్కువ కష్టాలు పడేవారు ప్రపంచంలో ఎందరో!? వారికన్నా మనం నయం అని అనుకోవాలి పాజిటివ్ గా ఆలోచించాలి.ఒకగీతను చిన్న గా చేయాలి అంటే దాని పక్కనే ఇంకో పెద్ద గీత గీస్తే చాలుగా! ఇలా ప్రతివారూ ఆలోచించాలి.ఇదే నేటి కౌన్సెలింగ్ మానసిక ఒత్తిడి కి చిట్కాలు.సైకాలజిస్ట్ సైక్రియాటిస్ట్ చేసే మాటలప్రయోగం🌹
బృహదర్శుడు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి