మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధం లో ప్రతిపక్షం లో తాతలు,తండ్రులు, సోదర సమానులు,గురుతుల్యులు, వున్న కారణం గా అర్జునుడు మాయామోహం లో పడి మనస్థాపం చెంది విల్లును క్రింద పడవైచి యుద్ధం చేయలేనని అశక్తత వెల్లడించినప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు స్వధర్మాచరణ గూర్చి అత్యద్భుతం గా బోధ చేసారు. : దేశ ప్రజల రక్షణ కోసం, అధర్మాన్ని శిక్షించేందుకు , ధర్మ పరిరక్షణ గావించేందుకు యుద్ధం చేయుట క్షత్రియ ధర్మం. ఈ ధర్మచరణ లో అసువులు బాసినప్పటికీ వీరస్వర్గమే ప్రాప్తిస్తుంది. అట్లు కాక వెన్ను చూపి పలాయనం చిత్తగిస్తే స్వధర్మాచరణ గావించని కారణం గా రౌద్రవాది నరకములు ప్రాప్తిస్తాయి. కావున నీ క్షత్రియ ధర్మమును నెరవేర్చు” అని అర్జునుడికి హితబోధ చేసి కర్తవ్యన్ముఖుడిని గావించారు. పై ఉదంతాన్ని బట్టి స్వధర్మాచరణకు తమకు విధించిన కర్తవ్య నిర్వహణకు శ్రీ కృష్ణ భగవానుడు విశిష్ట స్థానం కల్పించారు.
స్వధర్మమనగా మనకు విధింపబడిన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని ప్రతీ ఒక్కరు సక్రమంగా నిర్వహించడం వలన వ్యక్తిగతం గానే కాక సమాజ పరం గా కూడా శ్రేయస్సు ఒనగూరుతుంది.
శ్రీ రామచంద్రుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అయి ఉండినా కూడా దానిని ప్రదర్శించుట కంటే తాను పుట్టిన కులమగు ఇక్ష్వాకువంశపు ధర్మము ఆచరించుటయే గొప్ప అని భావించాడు. అలా తన ధర్మమును తాను ఆచరించుట వలన ఈ లోకములో కీర్తియు, శరీర పతనానంతరము స్వర్గము లభిస్తాయని అతని విశ్వాసము. అందుకే స్వధర్మాచరణనకే ప్రాధాన్యమునిచ్చేవాడు.
‘దిల్ మే రామ్.. హాత్ మే కామ్’ అంటారు కబీరుదాసు. లోపల ఈశ్వర స్మరణ బయట స్వధర్మాచరణ ఉండాలి. మనం ప్రార్థించేటప్పుడు భగవంతుడు మన కర్మలను కూడా చూస్తాడు. మనం చేసే ప్రతి కర్మ... భక్తి-జ్ఞానయుక్తంగా ఉండడమే భగవత్పూజ. అదే నిజమైన దైవ పూజ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి