జాతీయ బాలికల దినోత్సవము
 భారతదేశంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న విద్య, పోషకాహారం, బాల్య వివాహాలు, చట్టపరమైన హక్కులు , వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం వంటి సమస్యలపై అవగాహన  ప్రజలలో కల్పించడానికి జాతీయ బాలికల దినోత్సవము తేది 24-1-2008 నాడు ప్రారంభమై ప్రతి సంవత్సరము జనవరి 24 నాడు జరుపుకోవడము ఆనవాయితి.  ఇది భారత  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరప బడుతుంది. 
 ప్రాముఖ్యత:  ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా చర్యలు చేపట్టడము మరియు వారి సర్వతోముఖాబివృద్ధికి పాటుపడడము.
కార్యక్రమాలు:
1.సమాజంలో బాలికలు ఎదుర్కొన్న సమస్యలు గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి జరుపుకుంటారు. బాలిక శిశువు గురించి అసమానత్వం విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహంల గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడము
2.సమాజంలో మహిళల పాత్ర అనే అంశంపై అవగాహన కల్పించడము.
3. అమ్మాయిలు సాధారణంగా వారి జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ రకాల సాంఘిక వివక్ష, దోపిడీని తొలగించడం.వారి విద్యా , ఆరోగ్యము,  ఉపాధి విషయాలపై అవగాహన కల్పించడము.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం