కొండంత భరోసా;- -గద్వాల సోమన్న,9966414580
భరతమాత నీడలోన
బ్రతుకుదాం నిర్భయంగా
సాహసాల ఓడలోన
సాగుదాం నిశ్చయంగా

అక్షరాల తోటలోన
గడుపుదాం ఉల్లాసంగా
అనురాగాల కోటలోన
బ్రతుకుదాం ఉజ్జీవంగా

చెలిమి కలిమి మేడలోన
ఉందాం హాయి హాయిగా
ఆత్మీయతల వాడలోన
కలుసుందాం బహు ఘనంగా

మహనీయుల బాటలోన
పయనిద్దాం హుందాగా
తేట తెలుగు ఊటలోన
త్రాగుదాం తీయతీయగా!


కామెంట్‌లు