పురందరదాసు! అచ్యుతుని రాజ్యశ్రీ

 కర్ణాటక సంగీతంలో పిళ్ళారిగీతాలు కన్నడంలో ఎక్కువ ఉంటాయి.అవి రాసిన వాగ్గేయకారుడు పురందరదాసు.పూనాకు సమీపంలో పురందరగడలో క్రీ.శ.15 వశతాబ్దిలో జన్మించారు.శ్రీనివాసనాయకుడు అసలు పేరు.రత్నాలవ్యాపారి.మహాలోభి.భార్య సరస్వతీ బాయి ఈయనకుపూర్తి విరుద్ధం.ఒక పేద బ్రాహ్మణుడు కొడుకు ఉపనయనం కి సాయం అర్థిస్తే రేపు మాపు అంటూ ఆర్నెల్లు ఇంటిచుట్టూ తిప్పాడు.భార్య జాలితో  భర్తకు తెలియకుండాముక్కుపుడక ఇస్తుంది.బ్రాహ్మడు తన కొడుకుకి దాన్ని ఇచ్చి బంగారు దుకాణం లో డబ్బు తెమ్మని అంటాడు.ఆపిల్లాడు శ్రీనివాసుని కొట్టుకెళ్లి అమ్మి డబ్బు తో వెళ్లి పోతాడు.అది తనభార్య ది అని గుర్తించి షాపులో పెట్టెలో దాచి ఇంటికెళ్ళి భార్య ను అడిగాడు " నీవు ముక్కుపుడక ఎందుకు తీశావు? పెట్టుకో" అని గర్జిస్తాడు.పూజగదిలోంచి తీసుకుని రా‌..అని ఆమె రహస్యం ని రట్టు చేయాలనుకుంటాడు.ఆశ్చర్యం! అదే ముక్కు పుడక.వెంటనే దుకాణం కి వెళ్లితే తాళం ఉంది కానీ అది లేదు‌
అంతే పాండురంగని ధ్యానం చేసే భార్యను అభినందించి ఆస్తఇనంతఆ దానధర్మాలు చేసి తంబుర చిరుతలతో బైలుదేరిహంపీలో వ్యాసరాయలు వద్ద మంత్ర దీక్ష పొందాడు.80 ఏళ్లు దాటాయి. ఆతర్వాత దైవంలో లీనమైనాడు.4 లక్షల75వేల కృతులు వివిధ రాగాల్లో రచించారు.దాసరేందర దాసర పురందరదాసర అని కన్నడంలో సామెత 🌷
కామెంట్‌లు