నక్షత్రాలు వేరైనా కాంతి జన్మమొక్కటే!!
ఆకర్షణలు ఎన్నైనా పడతి ముక్కుపుడక ఒకటే!!!
ఆకుపై నుంచి జారుతున్న నీటి చుక్క
మొక్క మొక్కుబడేమో
అరుదైన ఆవిడ మేను మైదానమే!!
పుష్పిస్తున్న గాలి పూలు పరిమళాల కళాఖండాలు!!
ఖండాంతర జాతరకు జాతీయ పక్షుల ఆహ్వానం!!
ఎరుపెక్కిన మేఘాలు చిమ్మ చీకటిలో
చిక్కుకున్న వెలుగులీనకుండా ఉండలేవు!!
అందమైన అద్దం వజ్రాన్ని సైతం సవాలు చేస్తుంది.!!
నీడలు మర్రిఊడలై నేలలోకి పాతుకు పోతున్నాయి!!!
మెత్తని ఆల్చిప్ప పొత్తిళ్లలో ముత్యాలు పురుడు పోసుకుంటున్నాయి,!!
గర్భగుల్లో పసిడి దేవుళ్ళు పుడుతూనే ఉంటారు.!!
కళ్ళు కంటున్న చూపులను చెక్కే శిల్పులు కనురెప్పలు!!
అనంత లోకాల్లో శంఖం శబ్దం పూరిస్తుంది.!!
పూల తోటల్లో గంధపు నదులు పారుతున్నాయి.
ఎక్కడో గందర్వుల గానం సుందరంగుల శిలలను కరిగిస్తున్నాయి..!!
విరిగిన మాటలు తెల్లని మల్లెపూలల పూస్తున్నాయి.!!
కుంకుమ పూలు నుదుటిపైన పండేటట్లు కాశ్మీరం ఆశీర్వదిస్తుంది.!!!
జత కట్టిన రామచిలుకలు ఎప్పుడు రంగులు మార్చవు.!!
ఆకలీలో అమ్మ దాగుంది. తీర్థం లో పవిత్రం ఉంది.!!!
ఎగురాలనుకున్నప్పుడు నడవగలిగి ఉండాలి.!!
అమాయకంలో ఆకర్షణ, దయలో ఉదయం పుడుతుంది.!!!
ఆకాశంలో దోసెడు సూర్యుల్లను చల్లి చూడు.
నేలపై వేల పాలపుంతలు పండుతాయి.!!!
నోటిలో మాటల్ని దాచిపెట్టు, స్వరపేటికలు స్వర్ణపేటికలవుతాయి.
మంచు పర్వతాలకు కుంకుమ పూలు కూతుళ్లు.!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి