సుప్రభాత కవిత ; - బృంద
శిలలైన కలలను కూడా
పసిడిలా మెరిపించి
ప్రవాహంలా కరుణను
కురిపించి మార్చేసే......

కలలు కనే కనుల నిండా
కోరిక తీరిన ఆశల మెరుపులు మెరిపించి మురిపించి
మై మరపించి నడిపించే.....

కొత్తగ మారిన జగతిని
మధురమైన క్షణాలను
అపురూపంగా దాచుకోమని
అక్షయంగా మార్చేసే....

వెతలన్నీ వెలుగుల్లో
కరిగి కదిలి సాగిపోగా
స్వప్నాలన్నీ సత్యాలుగా
సాకారంగా నిలబెట్టే....

చిత్తంలోని చిన్ని చిన్ని
మధుర భావాలన్నీ తరంగాలై
ఉప్పెనలై....వరదలై
ఉప్పొంగేలా వరమిచ్చే.....

జీవితంలో ఆసాంతం
వసంతమే అనుగ్రహించి
శాంతం సౌఖ్యాలను
సొంతం చేసుకొమ్మని వచ్చే 

వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు