శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
231)సంప్రమర్దనః -

తమోగుణులను పీడించువాడు
దుష్టులను అణిచివేయువాడు
క్రూరులను మర్దించగలవాడు
నీచసంహారము చేయునట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
232)అహం సంవర్తకః -

రోజులు చక్కగానడిపించేవాడు
ఉదయాస్తమయాల  కారకుడు 
ఆదిత్యుడు అయినట్టివాడు 
దినదినమునూ భాసిల్లువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
233)వహ్నిః -

యజ్ఞములందు జ్వలించువాడు
హోమకుండమునందున్నవాడు
హవిస్సులు మోసెడివాడు 
నిత్యమునూ జ్వలించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
234)అనిలః -

ప్రకృతిలో నున్నట్టివాడు
వాయురూపమునున్నట్టివాడు
ప్రాణులందు నివసించువాడు
జీవమును యిచ్చినట్టివాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
235)ధరణీధరః -

భూ భారమును భరించువాడు
విశ్వమును ఆవహించువాడు
ధరణిని ముట్టెపై మోసినవాడు
వరాహావతారము దాల్చినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు