ఓ సూర్యుడా!
మళ్ళీ వచ్చేస్తున్నావా?
గుండెలనిండా వేదనలతో
కూడు గుడ్డ కోసం
కండలుకరిగి,చమర్చినా జడవక
బండలు పిండిచేసే
బడుగులపై దయలేక
ఎండల వేడితో ఏల దహిస్తావయ్యా?
బాటసారులు
ఎండకు ఓర్వలేకున్నారు
వడదెబ్బలతో
చిన్నాపెద్దలు వడలిపోతున్నారు
అగ్నికణాలు రాల్చే
నీ ఆగ్రహానికి భయమేస్తోంది
మాపై జాలిచూపి మమ్మాదుకోవయ్యా
ఓ సూర్యభగవానుడా!!!
**************************************
సూర్యుడా!;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి