..... ఐతే ఎంటి....;- గజ్జల స్వరూపరాణి- మెంబర్, ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ -హన్మకొండ వరంగల్ జిల్లా
 నేను వితంతువునే 
కనీ  బాద్యతల మోస్తున్న ఇల్లాలినీ
సమాజం ఎదో అంటుందనీ 
మూలకు కూర్చొలేను 
వారి స్పూర్తి నాలో నింపుకోని
మా ప్రేమ ప్రతి రూపాలుగా 
నా కన్న బిడ్డలను పెంచి
పోషించే   బాద్యత నాదే కదా 
పెళ్లినాటి ప్రమాణలు మరిచి
నూరెండ్ల జీవితం మద్యలోనె
విడిచినాడు  వారి ఆశల ఆశయాలు నెరవేర్చలి 
నా ఇంటిని నే నిలబెట్టలి
మొడువరినా వృక్షంను విసిరేయడం సరికాదు 
వంట చేరుకుగ మరి తను
మంటల్లో కాలిపోతు మనకు
మేలుచేయలేద 
మహాభారతంలో కుంతి
వితంతువు కదా 
బిడ్డలను ధర్మమర్గంలో నడిపి
చరిత్రలో నిలిచిపోయింది 
తమ పిల్లల కోసం ఎన్ని అవమానంలైన బరింస్తు ంది 
సమాజంలో  తన బిడ్డలను
ఆదర్శంగా పెంచుతుంది అమ్మ
వితంతువు వితంతువు అంటు
వింతగా మాట్లాడవద్దు ఆమె
ప్రతి ఇంటిలో ఒక అమ్మ 
నాన్న జ్ఞాపకాలు ఆమెలో చూడండి 
నేటి సమాజంలో ఎందరో
ఆడపడుచులు ఉన్నారు
భర్త అడుగుజాడలో నడుస్తూ
భారమైన బాద్యతలను మోస్తు
జీవిస్తున్నారు
కుటుంబం అండదండలు 

ఉన్నంతవరకు ఎ విమర్శలు
వారిని ఏమి చేయలేరు
వితంతువు వితంతువు అంటు
విమర్శించకండి 
ఆమె మీ కుటుంబంలో ఒక్కరే
అని గుర్తించండి🙏
********************

కామెంట్‌లు
నిజమే మేడం గారు.మీ కవిత చాలా బాగుంది.భర్తకు దూరమై చిన్న వయసులో కుటుంబ బాధ్యతల బరువులు మోస్తూ....తన పిల్లల భవిష్యత్తుకు ఆరాట పడుతూ...ఉద్యోగానికి ఇంటినుండి కాలు బయట పెట్టిన మహిళ ఎదుర్కొనే అసమానతలు,సంఘర్షణలు,వేదనామయ హృదయపు బరువులు మోస్తూ...అబద్ధపు నవ్వులు పులుముకొని అహర్నిశలు గమ్యం చేరే ప్రయత్నం చేసే ప్రతి మహిళకు మీ కవిత ఎంతో ఊరటని అందిస్తుంది.అభినందనలు.
ధన్యవాదములు👌👌👏👏🙏🙏👏👏👍💐💐