భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ ధర్మరాజు ని చూడగానే నమస్కరించి అర్జునుడిని గుండెలకు హత్తుకుంటాడు.ధర్మరాజు తనకంటే పెద్ద అన్న పూజ్య భావం.ధర్మరాజు సంజయరాయబారం తర్వాత కృష్ణుని దగ్గరకు స్వయంగా వెల్తాడు. సరాసరి "కృష్ణా! నీవే రాయబారిగా వెళ్లు" అని అడగడు శాసించడు.ఎంత ఒద్దికగా జాలిగా మాట్లాడాడో చూడండి" మేం చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతులం.సాధారణంగా తండ్రి తన కొడుకు సుఖసంతోషాలు ఆలోచిస్తాడు.వాడి సుఖం కోసం ఎంతో కష్టపడి తల్చుకుని కుమిలిపోతూ వెంపర్లాడుతాడు.. తల్లి ప్రేమను గురించి అంతా మాట్లాడటం సహజం.కానీ తండ్రి ప్రేమ ఆప్యాయత వాత్సల్యం అమ్మ కన్నా తక్కువ కాదు.మానాన్న పాండురాజు బ్రతికి ఉంటే మాఐదుగురికి ఇంత దీన హీన స్థితి ఉండేదికాదు.రాకుమారులుగా సుఖభోగాలు అనుభవించే వారం.మాకు నీవే తల్లివి తండ్రివి గురుడవు సఖుడవు సర్వం నీవే కృష్ణా! మా బాధ చూస్తున్నావు కదా? ఐదూళ్లు ఇవ్వడం కూడా ఇష్టంలేదు మా పెద్దనాన్న కి.మరి మాకుటుంబాల్ని మేమెలా పోషించు కోవాలి? ఎన్నాళ్ళు భిక్షాటన తో గడపాలి? ఇంటికి పెద్ద దిక్కు అన్నగా నాకర్తవ్యం ధర్మం కుటుంబ ఆలనాపాలనా. దిక్కు లేని అనాధలు తండ్రి లేని బిడ్డలం మేము.మాకు నీవే న్యాయం చేయాలని నాకోరిక.ధర్మస్వరూపుడివి సాక్షాత్తు భగవంతుడివి.నీవు స్వయంగా కౌరవుల దగ్గరకు వెళ్లి మాగోడు విన్నవించు." అని ఎంతో వినయంగా గుండె కరిగేలా మాట్లాడాడు.అదీ ధర్మరాజు మాటచాతుర్యం సమయోచిత ప్రజ్ఞాపాటవం🌷
ధర్మరాజు భక్తి! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి