సంత్ నామదేవ్! అచ్యుతుని రాజ్యశ్రీ

 దేవాలయంకి వెళ్లే అవకాశం రోజూ లేకుంటే బాధపడనవసరంలేదు. రోజూ ఏపని చేస్తున్నా దైవనామస్మరణ చేస్తే చాలు.మనదగ్గరకే భగవంతుడు వస్తాడు అని చెప్పిన సంత్ నామ్ దేవ్ పాండురంగ భక్తుడు.కులవృత్తి బట్టలు కుట్టే దర్జీ.సంసారసాగరంలో మునిగి తేలుతూ ఇలా ఆధ్యాత్మిక భావాలు తన వృత్తిలో సమన్వయం చేశాడు." నామనసు దర్జీ దగ్గర ఉండే కొలిచే టేపు స్కేలు.నాలుక‌ కత్తెర.జీవితం వస్త్రం.భగవనామ స్మరణతో  తరిస్తాను.జీవితం అనే బట్టకి భక్తి అనే రంగు వేసి నామజపం సూదితో కుడతాను." ఎంత అద్భుతంగా చెప్పాడు ఆభక్తుడు. 
ఆయన జీవితం మహా చిత్రం! పండరీపురంలో. దామాశేఠ్ గుణాబాయి దంపతులకు ‌సంతానంలేదు.పాండురంగని సేవిస్తూ ఉండేవారు.చంద్రభాగా నదిలో ఒక పసివాడు తేలుతూ కన్పిస్తే ఆపసివాడ్ని ఇంటికి తెచ్చాడు దామా.నాందేవ్ అని పేరు పెట్టి ప్రాణం కన్నా మిన్నగా పెంచారు.ఐదేళ్ల చిన్నారి నాందేవ్ తో తండ్రి ఒక రోజు ఇలా చెప్పాడు " బంగారు తండ్రీ! నేను పొరుగూరు వెల్తున్నా.గుడిలో దేవునికి నైవేద్యం ఇచ్చిరా." అని భార్య కు కూడా చెప్పాడు. అమ్మ ఇచ్చిన నైవేద్యం తీసుకుని నాందేవ్ గుడి కెళ్ళి" దేవుడూ! నీవు తొందరగా తిను. గిన్నె ఖాళీ చెయ్యి" అంటాడు.విగ్రహం తింటుంది అని ఆపసివాడి నమ్మకం.పెద్దగా ఏడుస్తూ స్వామి పాదాల వద్ద తలబాదుకోటంతో భక్తసులభుడు పాండురంగడు తింటాడు.ఖాళీ గిన్నెచూసితల్లి అడిగితే " దేవుడు తిన్నాడు" అని చెప్తాడు.అలా తండ్రి వచ్చే దాకా నాందేవ్ అమ్మ ఇచ్చిన నైవేద్యం గుడికి తీసుకుని వెళ్లి ఖాళీ పాత్రతో రావడం జరుగుతుంది.తండ్రి తిరిగి వచ్చి చాటుగా గుడిలో దాగి అసలు విషయం తెలుసుకుని కొడుకు కారణజన్ముడు అని ఆనందపడ్డాడు.పాండురంగడు పసివాడి నైవేద్యం స్వయంగా తినటం ఓ అద్భుతం కదూ?
పెరిగి పెద్దయ్యాక సంసార సాగరం ఈదుతూ తీర్థయాత్రలు చేస్తూ " పక్షిని ప్రఖ్యాతి" అనే భక్తి పాటలో ఇలా అంటాడు "మేత కై వెళ్లి న తల్లి పక్షి కోసం పిల్లపక్షి ఎదురుచూస్తుంది.తల్లి ఆవు రాకకై దూడ అలమటిస్తుంది.పాండురంగా! నీకోసం తపిస్తున్న నన్ను నీలో ఐక్యం చేసుకో!" నాగనాధ క్షేత్రం లో గుడిలో భక్తి పారవశ్యంతో ఆడి పాడుతూ జనాల అభిమానం ప్రేమ పొందాడు.చంద్రభాగా తీరంలో భక్తుల తో కల్సి సత్సంగము లో పాల్గొంటూ  దైవ స్మరణ చేసేవాడు.ఒకసారి యాత్ర చేస్తూ దాహం వేస్తే  కనపడ్డ బావిదగ్గర ఆగాడు.తాడు బకెట్ లేవు.పాండురంగస్మరణచేస్తూ కూచున్న అతని దగ్గర కే బావిలోని నీరు పైకి ఊటలాగా ఎగిసి ఆయన దాహాన్ని తీర్చింది.దైవస్మరణచేస్తూ పాండు రంగని లో ఐక్యమైన ధన్యజీవి నాందేవ్🌷
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం