సహాయం;- షెహిస్తా-ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-7675037407

  తిమ్మాయిపల్లి పాఠశాలలో సింధు, నిర్మల, కృష్ణవేణి, మళేహ లు చదువుతున్నారు. నలుగురు ఎప్పుడు కలిసిమెలిసి ఉంటూ అందరితో ఆడుతూ పాడుతూ ఉండేవారు. పాఠశాలలో అయినా గ్రామంలో అయినా నలుగురి స్నేహం చూసి ఆనందించేవారు. పాఠశాల విద్యార్థులతో పోటీపడి మరి మీరు బాగా చదివి మొదటి వరుసలో నిలిచేవారు.
                    మూడు రోజులుగా నిర్మల బడికి రావడం లేదు. నిర్మల బడికి రాకపోవడంతో స్నేహితులు ఆందోళన చెందారు. ఒకరోజు సాయంత్రం బడి నుంచి వెళ్లేటప్పుడు నిర్మల ఇంటికి వెళ్లారు. నిర్మల అనారోగ్యంతో మంచంపై పడుకుని ఉంది. నిర్మల గుండెలో చిన్న రంద్రం పడిందని అందుకే నిర్మల అనారోగ్యంతో ఉండి బడికి రాలేకపోతుందని వాళ్ళ అమ్మ వారికి చెప్పింది. మరి రేపు బడికి నిర్మలను పంపిస్తారా అని వాళ్ళు అడిగాడు. లేదమ్మా ఆపరేషన్ చేయించాలి డబ్బులు లేవు నిర్మల బతకడం కష్టం అని ఏడ్చింది.
                సింధు, కృష్ణవేణి, మళేహ ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులకు నిర్మల ఆరోగ్య పరిస్థితి దుఃఖించారు. మరుసటి రోజు ఉపాధ్యాయులకు చెప్పారు. అందరూ నిర్మల ఆరోగ్య పరిస్థితికి ఆందోళన చెందారు. ఈ విషయం గ్రామస్తులందరికీ తెలవడంతో నిర్మలా సహాయ నిధి ఏర్పాటు చేసి డబ్బు జమ చేసి ఆపరేషన్ చేయించారు. నెల రోజుల్లోనే నిర్మల మామూలు విద్యార్థుల వలె బడికి రాసాగింది. పాఠశాల విద్యార్థులతో పాటు సింధు, కృష్ణవేణి, మళేహ లు చాలా సంతోషించారు. అనారోగ్యంతో ఉన్నవారిని పెద్దగయ్యాక తప్పకుండా రక్షించాలని విద్యార్థులంతా ప్రతిజ్ఞ చేశారు.

నీతి: మంచి కోసం ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం