పరిసరాల పరిశుభ్రత- సన తబసుం-ఎనిమిదో-తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9948307160
  అనగనగా నర్సాపూర్ అనే ఒక పెద్ద ఊరు ఉండేది. ఆ ఊరిలో చాలా జనం నివసిస్తూ ఉండేవారు. వాళ్ల ఊరిలో ఏ పని కూడా సరిగా దొరికేది కాదు. కొంతమంది మాత్రమే పని చేస్తూ ఉండేవాళ్ళు. రాజు, రజిత దంపతులకు ఒక్కగానొక్క కూతురు కౌసల్య. ఒకరోజు వారి ఇంట్లో ఉన్న చెత్తను ఒక మూలన వేసి వెళ్తున్నారు. అలా చెత్త వేయడం చూసిన మల్లవ్వ అనే ముసలవ్వ అలా చెత్త వేస్తే పిల్లలకు, పెద్దలకు అనారోగ్యం వస్తుందని చెబుతోంది.  కానీ వాళ్లు ముసలవ్వ మాట వినకుండా ప్రతిరోజు అక్కడే చెత్త వేయసాయరు. 
              ఇంట్లో చెత్తతో పాటుగా ప్లాస్టిక్ వస్తువులు కూడా చుట్టూ పరిసరాల వద్ద వేయసాగారు. జంతువులు కూడా అక్కడే తిరుగుతూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాయి. ఆప్రాంతమంతా దోమలతో నిండిపోయింది. చిన్నారి కౌసల్యతో పాటుగా పక్కన ఉన్న పిల్లలకు అందరికీ జ్వరం వచ్చింది. 
               డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ జ్వరం వచ్చింది దోమల వల్ల అని చెప్పాడు. అందరూ ఆలోచనలో పడతారు. పిల్లల వైద్యానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. హాస్పటల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేలోగా ఇంటి పరిసరాలలో చెత్త లేకుండా శుభ్రం చేయసాగారు. ముసలవ్వ మాట వినుంటే ఇంత సమస్య వచ్చేది కాదని తమ తప్పును తెలుసుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోసాగారు.
-----------------------------------------------

నీతి: ఎవరు మంచి మాట చెప్పినా వినాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
.




            
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం