అమ్మ;- బి. పూజిత-ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా
 ఉదయాన్నే నిద్ర లేచి 
ఇంటి పనులు ఎన్నో చేసి
మంచి చెడులు చూసుకుంటూ
మనలను రక్షించేది అమ్మ
పిల్లల్ని బడికి పంపి 
పొలం పని ఎంతోచేసి
కష్టపడే జీవి అమ్మ
బిడ్డల చదువు కొరకు
ప్రతిక్షణం ఆలోచించి
దారిని చూపేది అమ్మ
అమ్మలేని జన్మ లేదు
జన్మలో అమ్మను మరువలేము
అందుకే జన్మంతా రుణపడి
అమ్మతోటే ఉండి పోదాం


కామెంట్‌లు