చిన్నవాడి తెలివి ;-బండిపల్లి నిఖిల్ చరణ్, 9 వ తరగతి, జెడ్పిహెచ్ఎస్ ఇబ్రహీంనగర్, మండలం చిన్నకోడూరు, జిల్లా సిద్దిపేట. చరవాణి సంఖ్య. 6300203158.
 అనగనగా సురేంద్రపురానికి రాజు సురేంద్ర వర్మ. ఆ రాజుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు . మొదటి కొడుకు పేరు భూపతి అందరికంటే పెద్దవాడు. భూపతి విలువిద్యలో చాలా తెలివైనవాడు. రెండో కొడుకు పేరు శ్రీపతి ఖడ్గ విద్యలో చాలా నైపుణ్యం కలవాడు. మూడవ కొడుకు పేరు మహేంద్ర గదవిద్యలో చాలా తెలివైనవాడు .అలా కొన్ని నెలలు గడిచిపోయాయి ఆ సురేంద్ర ముగ్గురు కొడుకులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ముగ్గురు కొడుకులు ఇప్పుడు  పెద్దవారయ్యారు. ఒకరోజు సురేంద్ర వర్మ తన ముగ్గురు కొడుకులు పిలుస్తూ వాళ్ల ముగ్గురితో అంటాడు. ఇక రాజ్యాన్ని ప్రజలని నేను పాలించలేను.  ఇక మీ ముగ్గురులో ఒక్కరే పాలించాలి అంటాడు. పెద్దవాడు భూపతి ముందుకు వచ్చి నాన్న నేను పాలిస్తాను అని అంటాడు. ఇంతలోనే రెండవ కొడుకు శ్రీపతి వచ్చి లేదు నాన్న అన్న కన్నా నేనే బలవంతమైన వాడిని కనుక నేనే బాగా రాజాన్ని రాజపాలాననీ చాలా బాగా చేస్తాను అని అంటాడు. 
"నేను" "నేను" అని పోటా పోటీగా కొట్లాడుకుంటారు. సురేంద్ర వర్మ తన ఇద్దరు కొడుకులను చూసి చాలా బాధపడతారు. దాని తెల్లవారుజామునే ఆ ముగ్గురు కొడుకులకు ఒక పరీక్ష పెడతాడు. మీ ముగ్గురికి 500 చొప్పున నాణాలు ఇస్తాను. రెండు నెలలు మీ ముగ్గురు వివిధ చోటుకు వెళ్లి మీకు ఇచ్చిన 500 నాణాలు దేనికి ఖర్చు పెట్టారో నాకు ఆ రెండు నెలలు తర్వాత లెక్క చూపించండి.
 సరే అని ఆ ముగ్గురు మూడు చోట్లకు వెళ్తారు పెద్దకొడుకు అతను దగ్గర ఉన్న సగం నాణాల్ని ఖర్చుపెట్టి ఒక పెద్ద భవనాన్ని నిర్మిస్తాడు. మిగతా సగం నాణాల్ని తనకు ఇష్టమైన వస్తువులు, గుర్రాలు కొనుక్కుంటాడు.
 రెండవ కొడుకు నేనే అత్యంత బలమైన నా ఇద్దరి అన్నదమ్ములని ఓడించగలనని అత్యాశతో ఒక భవనం మరియు ఆయుధాలు ఇక వివిధ రకాల ఆయుధాలని కొని తెచ్చుకుంటాడు మూడవ కొడుకు ఒక రాజ్యానికి వెళ్లి అక్కడ ప్రజలకు అన్నదానం ఇక వివిధ సరుకులు, వాళ్లకు అవసరమైన వస్తువులు తినేటివి ఇవన్నీ అందిస్తాడు వాళ్లకు  పంట  పండియడానికి వివిధ రకాల ఎరువులు మొక్కలు నాటే విత్తనాలు ఇస్తాడు. ఆ ముగ్గురు అన్నదమ్ములు రెండు నెలలు వాళ్ళ చోట్లల్లో ఉంటారు. చూస్తూ చూస్తూనే ఆ రెండు నెలలు గడుస్తాయి రెండు నెలలా తరువాత ముగ్గురు తన తండ్రి దగ్గరికి వస్తారు. సురేంద్ర వర్మ అంటాడు మీకు ఇచ్చిన రెండు నెలల గడువు తీరిపోయింది. పదండి మీరు ఈ రెండు నెలల్లో ఏమేమి చేశారో చూద్దాం. మొదటి కొడుకు తను చేసిన పనిని చూపిస్తాడు నాన్న నేను ఒక పెద్ద భవనాన్ని కట్టాను. ఇక గుర్రాలు ఆయుధాలు వివిధ నాకు అవసరమైన వస్తువులు తెచ్చుకున్నాను అని అంటాడు. 
రెండవ కొడుకు నాన్న నేను ఒక భవనాన్ని ఆయుధాన్ని వివిధ కొత్త కొత్త ఆయుధాల్ని తెచ్చుకున్నాను.
 మూడవ కొడుకు "నాన్న నేను మన రాజ్యాంలోని ప్రజలకు అన్నదానం మరియు వాళ్లకు కావాల్సిన సరుకులు,  పంటకు ఎరువులు, పంట పండాలంటే విత్తనాలు ఇవన్నీ పంచిపెట్టాను నాన్న" అని అంటాడు. 
 సురేంద్ర వర్మ ఆ ముగ్గురు కొడుకులు రాజ్యానికి వెళతారు. 
"చిన్నవాడు అయినా మహేంద్రకు రాజ్య పాలన ఇస్తాను ఇదే నా ఆజ్ఞ"అని అంటాడు పెద్దవాడు  అంటాడు.
" నాన్న నేనే ఇక్కడ అందరికన్నా పెద్దవాన్ని నాకు ఎందుకు రాజ పాలన ఇవ్వలేదు.  ఇంతలోనే రెండవ కొడుకు వచ్చి నాన్న నేను ఇక్కడ నా ఇద్దర అన్నదమ్ముల కంటే బలవంతమైన వారిని నాకెందుకు రాజపాలన ఇవ్వలేదు నాన్న చెప్పండి.
 సురేంద్ర వర్మ అంటాడు నాన్న భూపతి శ్రీపతి నీకు అత్యాశ ఎక్కువ ఉంది. పెద్దవాడైన శ్రీపతి నీకు భవనాలు గుర్రాలు ఇక వివిధ రకాల వస్తువులు లో నీకు అత్యాశ చాలా బాగుంది అందుకే నీకు రాజ పాలన ఇవ్వలేదు.
 రెండవ కొడుకు శ్రీపతి నీకు నువ్వే బలవంతమైన వాడినని అత్యాశతో ఆయుధాలు వివిధ రకాలైన భవనాలు కట్టుకుంటూ వెళ్తున్నావ్ నీకు అందులో అత్యాశ చాలా ఉంది. అందుకే నీకు కూడా రాజ పాలన ఇవ్వలేదు.
 ఇక మూడవ కొడకా మహేంద్ర నీకు ఏ అత్యాశ లేకుండా ప్రజలకు కావాల్సిన వస్తువులు పంటకు కావాల్సిన ఎరువులు ఇంకా విత్తనాలు ఇచ్చావు. అందులో నీకు ఏ అత్యాశ లేదు. నువ్వు అందుకే   ప్రజలకు రాజ పాలన ఇస్తున్న నువ్వు ఇలాగే ఈ ప్రజలకు కావాల్సిన ఏ ఒక్క అవసరం లేకుండా ఉండాలి.
 ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి నువ్వు వాళ్లకు ఇస్తావు అని నాకు ఒక మాట ఇవ్వు. నువ్వు ఎంత పెద్ద బాద వచ్చినా ప్రజల పాలన రాజపాలన విడిచి వెళ్లనని నాకు మాట ఇవ్వు అని చెప్పగానే మాట ఇస్తాడు వెంటనే పట్టాభిషేకం జరిగి పోతుంది ప్రజలకు కష్టాలపాలు చేయకుండా కాపాడుతాడు అందరూ సుఖసంతోషాలతో ఉంటారు. జయహో మహేంద్ర అని జై జైలు పలుకుతారు.
కామెంట్‌లు