కడుములో పదోతరగతి విద్యార్ధుల వీడ్కోలు సమావేశం
 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగి గొప్ప భవితవ్యాన్ని పొందాలంటూ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. దేశభక్తితో మెలగాలని వక్తలంతా ప్రసంగించారు. విద్యార్థులంతా ఈ వేదికపై ఆటా, పాటా, మాటలతో ఘనంగా నృత్య ప్రదర్శన, జానపద రూపాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పోటీల్లో విజేతలకు సర్పంచ్ గుజ్జ రామారావు, ఎంపిటిసి వలురోతు గోవిందరావు, మాజీ సర్పంచ్ వలురోతు ధర్మారావు, 
పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బూరాడ రమేష్, వైస్ చైర్మన్ భూపతి లక్ష్మి, ఉపాధ్యాయుల చేతులమీదుగా బహుమతులను అందజేసారు. ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ నిపుణులు టొంపల మౌనిక హాజరై, విద్యార్థులు టేబ్ లను వినియోగించుటలో, టెక్నాలజీ కి సంబంధించిన పలు కీలక అంశాలను తెలిపారు. 
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, వై. నరేంద్ర కుమార్, రబి కుమార్ మహా పాత్రో, సుస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం