అన్ని నువ్వే;-సి.హెచ్.ప్రతాప్
 అన్నీ నువ్వే, అంతా నువ్వే, సర్వం నువ్వే
నా జీవితానికి ఆలంబన, స్వాంతన నువ్వే
కష్టం వచ్చినప్పుడు ధైర్య వచనాలను చెప్పి
ముందుకు నడవమని వెన్ను తట్టి
నన్ను ప్రొత్సహించి నడిపించే నావవు నువ్వు
దుఖం కలిగినప్పుడు అక్కున జేర్చుకొని
చీకటి అనంతరం వెలుగు రాక తప్పదని
మంచు వంటి చల్లని ఓదార్పు మాటలను చెప్పి
పసిబిడ్ద వలె లాలించె దేవతవు నువ్వు
సంతొషం కలిగినప్పుడు స్వేచా విహంగం వలె ఎగురుతూ
ఆ ఆనందాన్ని పది మందికి పంచి ఇచ్చే వెన్నెలవు నువ్వు
నాలో అణువణువునా నిండి వున్న ప్రాణ శక్తివి నువ్వు
అందుకే నా జీవితాధారం,జీవితానికి
మూలం ఆది, అంతం, అన్ని నువ్వే  
కనులు నీవి.. కన్నీరు నాది.
హృదయం నీది.. సవ్వడి నాది
ఈ స్నేహబంధం మన ఇద్దరిది
నీ కళ్లలో కన్నీరులా జారి..
మనసులో భావంగా మారి..
నీ ఊపిరిలో శ్వాసగా చేరి..
ప్రాణం ఉన్నంత వరకు నీ స్నేహితుడిగానే ఉంటాను  
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం