ఆంధ్ర భీష్మ! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆయనను పూర్తిగా మర్చిపోయిన తెలుగువారం మహాఘనులం!5జనవరి 1941 లో అస్తమించిన ఆ భీష్మ పితామహుడు న్యాపతి సుబ్బారావు పంతులు గారు.ఆరోజుల్లోనే ఉద్యాన పంటలు పండించారు.భగవద్గీతను వేలాదిగా ప్రచురించి ఉచితంగా పంచారు.1903 లో రాజమండ్రిలో హిందూ సమాజం అనే సంస్థను స్థాపించారు.విదేశీయాత్రముగించుకుని వచ్చిన స్వామి వివేకానంద కు మనదేశంలో మొట్టమొదటగా పూలమాల వేసి సత్కరించింది న్యాపతివారు.ప్రాంతీయభాషల అభివృద్ధికి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎడ్విన్ మాంటేగ్ కి వినతిపత్రం సమర్పించారు.మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని పట్టాభి గారితో కలిసి గట్టిగా వాదించారు.చింతామణి మాసపత్రికను నడుపుతూ రాజమండ్రిలో బీదవిద్యార్థులకు రాత్రి బడి ఏర్పాటు చేసిన ఘనత వీరిదే!
అజాతశత్రువుగా పేరు గాంచిన న్యాపతివారు 14 జనవరి 1857 లో నెల్లూరు జిల్లాలో పుట్టారు.మెట్రిక్ లో ప్రతిభకి గుర్తింపు గా పతకంపొందిన ఈయన డబ్బు లేక కొంత కాలం అధ్యాపకులు గా పనిచేసి మద్రాసు లో డిగ్రీ ఆపై లా చదివారు.అలా విద్యార్థి గానే కొంతమంది తో కలిసి 1875లో ఆంగ్ల న్యూస్ పేపర్ హిందూ ని నెలకొల్పారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా  పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.భారతజాతీయకాంగ్రెస్ కి1913_27 దాకా కార్యదర్శిగా పనిచేశారు.1957 లో  వీరి జన్మ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి.మన రెండో రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు ఇలా నివాళి అర్పించారు " రాజమండ్రి కి న్యాపతి కందుకూరి రెండు అఖండ జ్యోతులు"🌷
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం