హర హర శంకర భోలో శంకర,;- డా. అరుణ కోదాటి
  శివరాత్రి  పండుగ  శుభాకాంక్షలతో 💐

 ఏమిరూపమో
నీది  ఏమి i మాయ నో కదయ్య,నోరారా పిలిచినంతనే చెంతను చేరేవుకదయ్యా  || హర ||
అడిగినంతనే ఇస్తివికదయ్యా వరాలు వెనుక ముందు
చూడకనే అందుకే కదయ్య అందుకే అందురు నిన్ను భోళాశoకరుడని!!ఆపదలు కొనితెచ్చుకొన బ్రహ్మ, విష్ణు నినుకాపాడంగా పార్వతి మాతల్లికోరగా
   జాలిగుండెనీది జగంబు నేలగా గంగను
బంధించి  జుట్టనే  బందించ నందిని వాహనముగా
చేసికొని నాగును హారముగా ధరిస్తివి!!!
చంద్రుని కొప్పున సింగారించి, చందమామాలాంటి
చక్కని  తల్లి పార్వతి తల్లికి సగం శారీరాన్నే ఇస్తివి
ఇక నీ శరీ రాన్నంత  అందరికిచ్చి, మనసేమో భక్తులకి ఇచ్చి  నీకంటూ ఏముందయ్యా మమ్మేలు
జంగమయ్యా! జగన్మాత పతివన్న గొప్పతప్ప!!
    కైలాసమే నీఇల్లు కొండలు గుట్టలు నీ  పవలింపులు, ఆకులు ఆలములు నీ ఆహారములు
విభూదినే నీ అలంకరాలు, అయినా యువరాణి
వలచింది నీ  అందమైన రూపము చూడ.
నినుబందిగా చేసుకుంది మనసున, నీ మనసుకు
అయింది ప్రాణంలో ప్రాణంగా,.............
తండ్రి నే ఎదిరించి  అయింది నీకు సహధర్మ చారిని
నీజీవితమే తనజీవితమని,అష్ట ఐశ్వర్యాలు కాదనుకుని,పిలువని పేరంటలా యజ్ఞనికి వెళ్లగా
భoగపడి రాగ నీ ప్రేమకోసం....... చెప్పుకుంటూ
పోతే  ఎంతని  రాయను, ఏమని  రాయను!
ఆది దంపతులు మీరు ఆదర్శులు మీరు🙏
ఆయురారో గ్యములనిచ్చి,
పిల్లా పాపల నిచ్చు
ఆలు మొగల నడుమ ఇక్యత ని ప్రసాధించే తండ్రి
శరణు శరణు 🙏🙏నీకు శతకోటి దండాలయ్య 🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏💐💐🙏🙏🙏🌹🙏
                                                
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం