ప్రత్యక్షానుభవంతోనే సామర్థ్యాల సాధన ;- -ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య
 క్షేత్ర పరిశీలనలో ఎస్సీ కాలనీ పాఠశాల పిల్లలు
-బ్యాంకు, పోస్టాఫీస్ దేవాలయం సందర్శన
పిల్లలు ప్రత్యక్షానుభవంతోనే పాఠ్యాంశాల్లో నిర్దేశించిన సామర్ధ్యాలను సాధిస్తారని కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. శుక్రవారం ఆయన పాఠశాల పిల్లలను క్షేత్ర పరిశీలనలో భాగంగా స్థానికంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్, పోస్ట్ ఆఫీస్ కు తీసుకెళ్లి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా పిల్లల్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తీసుకెళ్లారు. పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉన్న ఆలయ ఆవరణాన్ని పరిశీలింప చేశారు. పిల్లల మనసుల్లో ఆధ్యాత్మికతను నింపారు. బ్యాంక్ లో ఎటిఎం, బ్యాంక్ పాస్ బుక్ ప్రింటింగ్ మిషన్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఇతర సిబ్బంది ఛాంబర్లను పరిశీలించారు. బ్యాంక్ లో జరిగే ఆర్థిక లావాదేవీలు, ఇతర సేవల గురించి తెలుసుకున్నారు. పోస్ట్ ఆఫీస్ లో ఉత్తరాలు, పార్శిల్ల బట్వాడా, డబ్బులు పంపించే విధానం, వివిధ పోస్టల్ పథకాల గురించి అవగాహన పొందారు. అనంతరం ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పిల్లలు వివిధ ప్రదేశాలను సందర్శించి, పరిశీలించి అవగాహన చేసుకున్న అంశాలు వారిలో సుదీర్ఘకాలంగా నిలిచిపోతాయని, నిర్దేశిత సామర్థ్యాల సాధనలో క్షేత్రస్థాయి పరిశీలనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఎస్బిఐ బ్యాంకు మేనేజర్ రాహుల్, బ్యాంకు సిబ్బంది, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శివకుమార్, దేవాలయ అర్చకులు, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం