మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మా మేనమామ బొమ్మా రెడ్డి గారు  ప్రముఖ  కమ్యూనిస్టు పార్టీ  అధినేత  వామపక్ష భావాలతో ఉన్న విశాలాంధ్ర పత్రికలో  ఉపసంపాదకతతో పత్రికారంగ జీవితాన్ని కొనసాగించారు తరువాత పార్టీలో సిద్ధాంత పరంగా భేదాలు వచ్చి  పత్రిక కూడా విడిపోయి  ప్రజాశక్తి అన్న పేరుతో  వేరే పత్రిక ప్రారంభించారు దానికి ఎడిటర్ గా మామయ్య  బొమ్మా రెడ్డి గారే వ్యవహరించారు. మార్క్స్  ధస్ క్యాపిటా పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తి  ఇక్కడ జరుగుతున్న రాజకీయ వ్యవహారాలను  మార్క్స్ సిద్ధాంతం  ప్రకారం ఇలా చేస్తే బాగుంటుంది  సమస్య పరిష్కారమవుతుంది అంటూ  అనేక సంపాదకీయాలు కూడా వారి కలం నుంచి వెలువడ్డాయి.నేను ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు మా హెడ్మాస్టర్ పోలు సుబ్బారెడ్డి గారు వారిని కలిసి బొమ్మ రెడ్డి గారు  పిల్లలకు  వాక్చాతుర్యం పెరగడం కోసం ఏలక్త్యుషన్ పోటీలు  ఏర్పాటు చేస్తే బాగుంటుంది  అనే సలహా ఇవ్వడంతో  సుబ్బారెడ్డి గారు ఆ ఏర్పాటు చేస్తూ ఉండేవారు  చాలా కార్యక్రమాలకు బొమ్మా రెడ్డి గారి వచ్చి అధ్యక్ష పీఠంలో  కూర్చునేవారు  మేము ఏ విషయాన్ని గురించి మాట్లాడిన దానిని  వామపక్ష  భావాలకు  అనుకూలంగా వ్యాఖ్యానిస్తూ  వారి అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉండేవారు  మాకు మాటల్లో కూడా  ఎందుకురా లేని వాళ్ళ గురించి అనవసరంగా అపోహలతో కాలాన్ని వృధా చేసుకుంటారు  హాయిగా మీ పని మీరు చేసుకోండి పూజలు పునస్కారాలు ఏంట్రా  అంటూ మాకు హితవు కూడా చెప్తూ ఉండేవారు. తరువాత చాలా సంవత్సరాలకు అప్పా జోస్యుల వారు ఆంధ్రదేశంలో  నాటక పోటీలు ఏర్పాటు చేసి  మంచి  బహుమతులను కూడా ఏర్పాటు చేశారు  ధన రూపంలో బహుమతులు ఉండేవి  తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను కంపిర్ను. దానికి బొమ్మా రెడ్డి గారు వారి పత్రిక నుంచి ప్రతినిధిగా వచ్చారు  మూడు రోజులు కార్యక్రమం అయిన తర్వాత  ఇక్కడ దాకా వచ్చావు కదా మావయ్య ఒక్కసారి స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు కదా అంటే  నమ్మకం లేనప్పుడు ఎందుకురా అన్నారు  అలా కాదు ఒకసారి వెళ్లి చూసి రా  అంటే  సరేనని వెళ్లి వచ్చారు  ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంది మావయ్య అంటే  ఏమోరా నాకు చాలా అయోమయంగా ఉంది  అక్కడ జనంలో నిలబడి వాళ్ళ గోల ఆక్రందన అనుకుంటూ నాకు ఎందుకు వచ్చాను అని అసహ్యం వేసింది  అలా తిట్టుకుంటేనే లోపలికి వెళ్లాను.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం