ఇప్పుడు మనం
ప్రశ్నించడం మరిచి పోదామా?!
గొడ్డులాగా కష్టపడినా
దేబిరించి అడగడమొక్కటే
నేర్చుకుందామా?!
మన శ్రమనంతా ధారపోసి
బడా పారిశ్రామిక సంస్థలకు ఊడిగం చేసి
ఆ సంస్థలకు మూలవేర్లమైన మనం
వారెంతిస్తే అంతే తీసుకొని
అదే పదివేలని వేలవేల దండాలు పెడదామా?!
ఆశలు ఆకాంక్షలు ఆత్మాభిమానం అన్నీ చంపుకొని బ్రతకడం నేర్చుకుందామా?!
శ్రమజీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు అని ముక్తకంఠంతో నినదిద్దామా?!
ఆదిశగా శ్రమసమూహాలు
జట్టుకట్టడం మరిచి
నోరు మూసుకొని పనిచేస్తామని కంపెనీ అగ్రిమెంట్ పత్రాల మీద సంతకం చేసి బహుళజాతి కంపెనీలకు శక్తివంచన లేకుండా
అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉందామా ?!
స్థిర చరాస్థులు లేని కాళ్ళు రెక్కలే ఆస్తిపాస్తులుగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల
ఆ శ్రమజీవులకు ఆత్మగౌరవబావుటాగా ఎగరవేద్దామా?!
దేశ జనాభాలో బడుగుబలహీనులే అధికశాతం కదా!
సంపద కొంత మంది దగ్గరే
మూలుగుతుంటే ఆకలి చావులు మరోవైపున ఉంటే
ఈ సంపద శ్రమజీవుల
స్వేదజల ఫలంగా మలుద్దాం
వారికి పంచుదాం
శ్రమయేవ జయతే అని అంటూ నినదిద్దాం!
ప్రపంచ కార్మికులారా ఏకంకండి
అని ఎలుగెత్తి చాటుదాం !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి