"భగవాన్" శబ్దవాచ్యుడు - పరమేశ్వరుడు;- కవిమిత్ర, శంకర ప్రియ , శీల ,. సంచార వాణి:- 99127 67098
⚜️షడ్గుణ సంపన్నుడైన
శాంకరీ మనోహరుడు
    "భగవాన్" శబ్ద వాచ్యుడు!
శివా నమో! నమః శివా!
         (...అష్టాక్షరీ గీతి.,)
👌పరమేశ్వరుడు...  షడ్గుణ ఐశ్వర్యములు కలవాడు! సర్వశక్తి సంపన్నుడు!
🔱కృత్తివాసాః పురారాతి:
     "భగవాన్" ప్రమథాధిప:! అని,
శ్రీమన్ నారాయణుడు.... "శ్రీశివాష్టోత్తరశత నామ స్తోత్రము" (69.నామము) నందు... శ్రీమత్ పరమేశ్వరుని ప్రస్తుతించారు!
👌సమగ్రమైన ఐశ్వర్యము (1), వీర్యము (2),యశస్సు (3), శ్రియము (సంపద) (4), జ్ఞానము  (5), వైరాగ్యము (6)...  అనెడు ఆరు గుణములు కలవాడు.. భగవానుడు! అని; మంత్ర ద్రష్టలైన మన మహర్షులు పేర్కొన్నారు!
 👌ఐశ్వర్యస్య సమగ్రశ్చ
  వీర్యశ్చ యశసః శ్రియః 
     జ్ఞాన వైరాగ్యయో శ్చైవ 
  షణ్ణాం భగ ఇతీరితా!
🚩కంద పద్యము
    ఐశ్వర్య వీర్య యశముల
    శాశ్వతముగ గూర్చు విభుడు, జ్ఞానము, శ్రియమున్
     విశ్వమ్మున వైరాగ్యము
నీశ్వరుడై యొసగు, కనుక నీశ్వరుడయ్యెన్!
        [డా. శాస్త్రుల రఘుపతి.,]

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం