శ్రేయోభిలాషి;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 త్రిమూర్తిరూపం ఇలనడిచే జ్ఞానసాగరం
నిలువెత్తు విజ్ఞానసర్వస్వం
బతుకువిలువల విన్యాసాలను
విడమరచే జ్ఞాన భాండాగారం
జీవితపాఠాలను నేర్పించే నిండుహృదయం
కదిలేది కదిలించేది నినుదారిలొ నడిపించేది
దారిదీపమై వెలుగొందేది జ్ఞానాంబుధిలో ముంచెత్తేది
కోపంతో కరుణించేది శాపంతో వరమిచ్చేది
మాటలతేనెలు కురిపించేది పరబ్రహ్మమై దీవించేది
తనశిష్యుల కళ్ళల్లో వెలుగుల తళుకులకోసం
తనజీవితాంతం పరిశ్రమించి నిలిచేది
తననోడించే అంతేవాసికోసం పరితపించేది
దేవుడుకోపిస్తే గురువు కాపాడగలడు
గురువుకోపిస్తే ఆ దేవుడేంచేయలేడు
అందుకే గురువాజ్ఞ మీరకు గురుసేవ మానకు
గురువుకు ప్రస్తుతపేరు ఉపాధ్యాయుడు
ఉపాధ్యాయుడే మన శ్రేయోభిలాషి అని మరువకు!!
**************************************


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం