రావా రావా రామయ్యా
రాను రాను సోమయ్యా
ఎందు కొరకు రావయ్యా
రాళ్లు ఎత్తలేను రామయ్యా !!
రాళ్లేమి ఎత్తోదు నీవయ్యా
రాసులు ఎత్తగా రావయ్యా
బస్తాలు నిండుగా నింపేసి
బండిమీద వేయ రావయ్యా !!
బండి గట్టి బాలయ్యా
సంతకు బండి తోలుతాడు
బస్తాలన్నీ దించేసి
కాంటకు పెట్టి రావయ్యా !!
సంచి నిండా వడ్లు ఇస్తాను
పొంచులు చూడక రావయ్యా
మంచి ఫలితం పొందయ్యా
ఇంటికి నీవు చేరయ్యా !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి