సుప్రభాత కవిత ; -బృంద
ఇష్టం లేని రాజీలు కొన్ని
అక్కరలేని చర్చలు కొన్ని
అవసరమైన సర్దుబాట్లు కొన్ని
అన్నీ మౌనంగా జరిగేవే!

మనసుకు తెరలేసి..
అడుగున పొరలో దాచేసి
అపుడపుడూ తడిమిచూసి
కళ్ళనీళ్ళు తిప్పుకునే వ్యధలు కొన్ని.

నచ్చక వచ్చిన కోపానికి...
వహించిన అబద్దపు శాంతానికి
నోరుమూయించే సహనానికి
ఆశ్రయించే గొడుగు మౌనం.

మదిలో సుడులు తిరిగే
సందేహాలెన్నో...సమస్యలెన్నో
ప్రశ్నలెన్నో?? సమాధానాలెన్నో?
జరిగే యుధ్ధానికి సాక్షి మౌనం.

అంతరంగపు మౌనానికి
ఆప్తమిత్రుని ఆగమనం
తెస్తుందా సమాధానం?
వేచి వున్న వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు