చదవాలి పుస్తకం ;- మిట్టపల్లిపరశురాములు

.చదవాలి చదువాలి కన్నా! .
.పుస్తకాలు చదవాలి మిన్నా!

.చదువుతో పాటుగ కన్నా! 
.సరిగమలు నేర్వాలి మిన్నా!

.చదువులో సారాన్ని కన్నా!
.చక్కగా  నేర్వాలి మిన్నా.! 

.విద్య లేని వాడు కన్నా!       
.వింత పశువే కదా నాన్నా! 

.నాయకుడు కావాలన్నా కన్నా! 
.శాస్త్రవేత్తలు కావాలన్నా చిన్నా! 

.పండితులు కావాలన్నా కన్నా!  
.గురువులు కావాలి మిన్నా.!  
             
.అక్షరం పొదగాలంటె కన్నా!        
.పుస్తకం కావాలి నాన్నా !                     
 ********                  

కామెంట్‌లు