క్రోధము జూపవే క్రోధి!-డాక్టర్ అడిగొప్పుల సదయ్య

 పాడవే కోయిలా! -"పాడె" గీతికలనిక

పాడు మనుజులను కా-పాడె చట్టములకున్;

మధురమా! క్రోధిలో మధుమేహమును పెంచి
మదకీచకుల నణచి మట్టుబెట్టవె రేగి;

లవణమా! క్రోధిలో లాలూచి నాయకుల
గుండెపోటుల బెంచి గుణపాఠమివ్వవే;

తిక్తమా! క్రోధిలో తెగ రెచ్చిపోయి నీ
చేదుతో నిజములను చెప్పించి చెరబెట్టు;

కారమా! క్రోధిలో కఠినవైఖరి బూని
గర్వాంధకారులను గద్దెనెక్కించకే;

అమ్లమా! క్రోధిలో నల్సరుల బుట్టించి
దోచి దాచిన దుష్ట నీచులను కడదేర్చు;

వగరుదనమా! క్రోధి బొగరుబోతుల పీచ
మణచి మరి రాకుండ యడ్డగించవె యెప్డు;

రుచులార! పేట్రేగి ఉచిత పథకాలతో
ఊరించు నీచులను ఉరికించి తరుమండి;

చైత్రమా! క్రోధిలో శరమించుకను లేక
రంగురంగులు మార్చు రణభీరువుల గూల్చు;

క్రోధి వర్షమ! చూపు క్రోధమును దయలేక
పసి పిల్లలను చెరచు విషపు కాముకులపై;

పశుపక్షులను చంపు పరమపాతకులపై;
నమ్మించి యేమార్చు నయవంచలటులపై;

ప్రజల సంపద దోచి పాలించు ప్రభుతపై;
తల్లిదండ్రుల వేచు దయలేని కొడుకుపై;

క్రోధి వర్షమ! చూపు ప్రోది యగు ప్రేమమును
పలుచ దీనుల యెడల పరమ కరుణాత్మవై;

బలుల దాకని హీన బడుగు జీవులపైన;
దైవసన్నిధి మెలగు ధర్మరాజులపైన;

(శరము=సిగ్గు;భీరువు=పిరికివాడు;లటులు=దొంగలు;ఏమార్చు=మోసపుచ్చు;వేచు=బాధించు;ప్రోది=అధికమైన;పలుచ=బలహీనులైన;బలులు=బలవంతులు;తాకని=ఢీకొనని)
కామెంట్‌లు
lokavirodhi చెప్పారు…
సదయ్య గారి ధర్మాగ్రహం సముచితంగా ఉంది.శుభాభినందనలు.
lokavirodhi చెప్పారు…
శరం అంటే బాణం గుర్తు లేదా అస్త్రం ‌. సిగ్గు కాదు కదా
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం