631)విశోకః -
శోకము లేకున్నట్టివాడు
దుఃఖభారములు లేనివాడు
బాధలను జయించినట్టివాడు
విశోకునిగా నుండినవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
632)శోకనాశనః -
భక్తుల దుఃఖమును అణుచువాడు
శోకము నాశనము చేయువాడు
బాధలను దూరముంచువాడు
కష్టజీవితము తొలిగించువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
633)అర్చిష్మాన్ -
తేజోరూపుడై యున్నవాడు
అష్టవిధానములలో పూజితుడు
వెలుగులు ప్రసాదించుచున్నవాడు
సర్వులతో అర్చింపబడువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
634)అర్చితః -
సర్వలోకములూ పూజించువాడు
విశ్వముతో అర్చింపబడువాడు
దేవతలు మ్రొక్కుచున్నట్టి వాడు
సర్వదా అర్చనలు జరుగువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
635)కుంభః -
సర్వమూ తనలోనున్నవాడు
కుంభమువలే రూపించువాడు
భూమిని తనయందుంచినవాడు
ధరణిని గాచుచున్నట్టివాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి