కలలు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 మనిషి 
తన తలపుల తలుపులను
ఎక్కడ తెరుస్తాడు?
తనవారి దగ్గరా?
తను ఎరిగినవారి దగ్గరా?
తన నేస్తాల దగ్గరా?
ఆకాశంలోనా? భూమిపైనా?
ఏమో ! అనుమానమే మరి!
ఆఁ…. తెలిసింది
అతడు
కేవలం కలలో
తన తలపుల తలుపులను
తప్పక బార్లా తెరుస్తాడు
అందుకే!
అతడికి కలలంటే ఇష్టం
కలల్లో జీవించడం ఇష్టం
కలలు కనడం ఇష్టం !!
**************************************

కామెంట్‌లు