కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆధ్యాత్మికత అన్నది తెలిసిన పద్ధతిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయోగం  మనం యజ్ఞం చేయడం దేనికి  కొంతమంది అంటూ ఉంటారు బ్రాహ్మణులను పోషించడానికి  కానీ వేద సంప్రదాయం ప్రకారం  ఆనాడు అహల్య  యజ్ఞం చేయడానికి కారణం వర్షం కురిపించాలి అని  బీడుగా ఉన్న  దేశ  పొలాలను సస్యశ్యామలం చేయడం కోసం  తాను త్యాగం చేసింది ఆనాడు   యజ్ఞాల వల్ల వర్షాలు కురిసిన  చక్కగా పొలాలు పండినాయి  ఆ దేశ గ్రామస్తులందరికి  ఆహారం పుష్కలంగా లభించింది  అయితే ఈ  యజ్ఞం చేసే యాజకుడు  నియమనిష్టలతో కార్యక్రమాన్ని చేయాలి  యజ్ఞంలో మొదట నివేదించగా మిగిలిన ఆహారాన్ని మాత్రమే అతను భుజించాలి. ఆధ్యాత్మిక మనసున్న సత్పురుషులు సర్వపాల నుంచి  భక్తుడు అవుతారు అన్నది నమ్మకం  తమ భోగానికి అన్నం వండుకునేవారు పాపని పూజిస్తారు అని  మన వేదాంతులు చెప్తారు. ప్రతి ప్రాణి ఆహారం వలననే జీవిస్తుంది  ఆ ఆహారం వర్షాల వల్ల వస్తుంది  ఆ వర్షం యజ్ఞాలు చేయడం వల్ల  కురుస్తోంది  నిర్దేసింపబడిన కర్తవ్యాలు వాటిని వివిధ కర్మలు అంటారు  ఆచరణ చే యజ్ఞములు జనిస్తాయి ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రకృతి చక్రాన్ని వివరిస్తున్నాడు  వర్షం వలన ధాన్యం ఉత్పన్నమవుతుంది ధాన్యం పూజించబడే రక్తంగా మారుతుంది రక్తము నుంచి వీర్యము జనిస్తోంది వీర్యమే మానవ శరీర సృష్టికి బీజం  మానవులు యజ్ఞములు చేస్తారు వీటితో దేవతలు వానలను కురిపిస్తారు అలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది  అని పురాణ పురుషులు మనకు చెప్పారు.
పెద్దలను గౌరవించడానికి చిన్న వయసులో ఉన్నవారు  సాష్టాంగ నమస్కారం చేయాలి  ఆ చేయడం మన సంప్రదాయం అణకువకు ప్రతీక  అయితే సాష్టాంగ నమస్కారమనేదానికి అర్థం తెలియాలి  నమస్కారమంటే  నాకు ఎలాంటి  ప్రత్యుపకారం కావాలనే ఆలోచనతో నేను చేయడం లేదు నా పంచేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు 5 కలిపి  10 ఇంద్రియములను మీకు స్వాధీనం చేస్తూ శిరస్సు వంచి  నమస్కరించడం ధర్మం  సాష్టాంగము అంటే ఎనిమిది అంగములతో కూడినది  ఏ మానవుడైన ఈ ఎనిమిది అంగాలతోనే నమస్కారం చేస్తూ ఉంటాడు  అందువల్లనే దేవాలయంలో బోర్లా పడుకుని దేవుడికి నమస్కరించి  ఆయా అంగాలను నేలకు తాకిస్తారు  స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు వారు  పంచాంగములతో కూడిన నమస్కారం మాత్రమే చేయాలి.



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం