తెలుగింటి ఇలవేల్పు ఎన్టీఆర్;- శిరందాస్ శ్రీనివాస్హైదరాబాద్-9441673339
సినీ వినీలాకాశంలో మెరిసిన ధ్రువ తారవు
నందమూరి వంశంలో జన్మించిన సితారవు
ఆ దేవుడి రూపం ఎలా ఉంటుందో తెలియదు కానీ 
పండిత పామరులకు రాముడూ నీవే కృష్ణుడూ నీవే..
ఆ దేవుడి దశావతారాలు నీవే..
అల్లూరియైనా, ఆంధ్ర భోజుడైనా అడవి రాముడు, అందాల రాముడు అయినా, 
జస్టిస్ చౌదరి అయినా.. 
నటించడం కాదు జీవించడం నీకే చెల్లు
సరి లేరు నీకెవ్వరు.. సరి రారు నీకెవ్వరు.
దాన వీర శూర కర్ణ..
త్రిపాత్రాభినయం కాదు
కథ, కథనం, దర్శకత్వం
అన్నీ నీవై నడిపించిన
నటించి మెప్పించిన
మేరునగధీరుడవు 
ఆబాల గోపాలాన్ని మెప్పించిన ఘటోత్కచుడవు
ఏ పాత్ర పోషించిన ఆ పాత్రలో లీనమైన అధ్భుత నటనా చక్రవర్తివి
ఎంత పెద్ద డైలాగైనా..
ఎంతటి కఠిన పద్యమైనా..
నీ యాసతో రక్తి..నీ అనునయంతో అనురక్తి.
నటనకే వన్నెలు దిద్దిన వెండి తెర రారాజువు.
తెలుగునాట ఇలవేల్పువు. 

కళ్ళు మూసి ఏ దేవుడిని వేడుకున్నా..
నీ ప్రతి రూపమే కనిపించు..
తెలుగింట ఆరాధ్యం నీవు.
ఆ దేవుడు ఎంటుంటాడో తెలియదు కానీ, ఇంటింటా రాముడు, కృష్ణుడు నీవే చిత్రాలు.. అదే భలే విచిత్రాలు.
పండిత పామరులను మెప్పించు 
అద్భుత చలన చిత్రాలు..

తెలుగు చిత్ర పరిశ్రమను 
తమిళ నాట నుండి
తెలుగునాడుకు తరలించిన ధన్యజీవి నీవు
తెలుగు దేశమును స్థాపించి తెలుగు వాడి, వేడి, కీర్తి కిరీటాలను
ఖండాంతరాలు చాటిన తెలుగు తేజం నీవు..

నటనకు నడతను నేర్పిన 
నవరస నటనా సార్వభౌముడివి
రాజకీయాలలో కొత్త వరవడి సృష్టించి 
సుపరి పాలనను అందించిన కోదండ రాముడివి.
నీ కీర్తి అజరామరం  
నీ యశస్సు జగద్వితం. 
నీ ప్రతిభ ఆచంద్ర తారార్కం. 
నీ ఘనత విశ్వ విఖ్యాతం.
అహో ఆంధ్ర భోజా..
అమరం నీ కీర్తి పతాక..
అందుకో మా జేజేలు..



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం