గేయాల పూవులపైతుమ్మెదనై వాలుతా!అక్షరాల మకరందంఆశతోడ గ్రోలుతా!పుస్తకాల పురుగునైవిజ్ఞానం జుర్రుతా!మస్తకాన్ని వెలిగించిఅజ్ఞానం తరుముతా!గురుదేవుల బోధలోనిపరమార్థం గ్రహిస్తా!వారు చూపు మార్గంలోఅలుపెరుగక సాగుతా!కన్నవారి ప్రేమలోనికరుణరసం త్రాగేస్తా!వారి సేవలలోనిదీవెనలు పొందుకుంటా!మహనీయుల మాటలు వినిబ్రతుకును దిద్దుకుంటా!పెద్దవారి గద్దింపులుప్రసాదం అనుకుంటా!
మనోభీష్టం;- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి