ఆత్మానంవిద్ధి;- సి.హెచ్.ప్రతాప్

 ఆత్మానంవిద్ధి అనే అంశాన్నే భగవాన్ రమణులు నిన్ను నువ్వు తెలుసుకో అని కూడా చెప్పారు. శరీరం, మనస్సు పవిత్రమై, బుద్ధి శుద్ధమై, నిర్వికారమై, ప్రశాంతమైనప్పుడు ఆత్మజ్ఞానం అనుభవం లోనికి వస్తుందని సాస్త్ర వాక్యం. ఆత్మజ్ఞాన్ని సిద్ధింపజేసుకున్న మహనీయులను స్థిత ప్రజ్ఞులని పిలుస్తారు. “ఆత్మజ్ఞానం” అంటే “ఆత్మ గురించి జ్ఞానం” అంటే, మన గురించి మనం తెలుసుకోవడం. “నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, ఆత్మను కూడా” అని తెలుసుకోవడం, “నేను మూల చైతన్యం” అని తెలుసుకోవటం.ఆత్మజ్ఞానం అన్నది “తొలిమెట్టు” అయితే, బ్రహ్మజ్ఞానం అన్నది “తుదిమెట్టు”.ఆత్మజ్ఞానం” లేనిదే “బ్రహ్మజ్ఞానం” అన్నది అసంభవం. సృష్టిలో ఉన్న అన్నింటిలోకీ ఆత్మజ్ఞానం తేలికైనది అని..! అది నిజానికి అంత తేలికైనది కూడా..! ఇది కేవలం మీరు ఒకే సమయంలో సుముఖంగానూ విముఖంగానూ ఉండడంవల్ల ఇలా జరుగుతోంది. ఈ సంఘర్షణ అన్నది మీది..! ఇది కష్టమైనది కాదు. మీలో ఉన్నదానిని అనుభూతి చెందడానికి మీరు ఏ కష్టమైన పనులు చెయ్యాలి అని సద్గురు ఆత్మజ్ఞ సిద్ధి గురించి చక్కగా విశదపరిచారు.ఈ జ్ఞానం కలగడానికి భగవంతుడిని సాధనగా చేసుకోవాలి. భగవంతుని రూపాలని మాత్రమే కాకుండా ఆయన చుట్టూ వలయంలా అల్లుకున్న దివ్యత్వాన్ని చూడాలి.ఏది మంచి? ఏది చెడు? ఏది ప్రగతికారం? ఏది ప్రతి బంధకం? అనేది తెలియాలంటే భగవంతుని ఉపదేశాలు మరీ ముఖ్యంగా వాటిలో నీతిని గ్రహించాలి. అప్పుడే మంచి నడవడికను నేర్చుకోగలుగుతాం.ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకునే గమ్యాన్ని చేరే మార్గాన్ని అవలంబించడం ఒక్కటే సరిపోదనీ, దానితో పాటు మనకు సాధనలో ఆనందం కలగాలనీ శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంద్రియ సుఖాల నుండి కలిగే ఆనందం  అశాశ్వత తత్త్వాన్నీ, తాత్కాలిక స్వభావాన్నీ చూడడం నేర్చుకోవాలి.సాయి తన అవతార కాలంలో ఎన్నో ఉపదేశాల్లోని సారాన్ని ఆచరించే ప్రయత్నం చెయలేదు. మనిషి ఉన్నతిని సాధించటానికి ఆయన చూపిన మార్గం ఎంతో విశిష్టమైంది. పూజలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులే ముఖ్యం కాదు, చేసే పనిమీద మనసును కేంద్రీకరించడం కూడా భక్తి యోగామేనని, అదే ప్రతి వ్యక్తి తొలి కర్తవ్యం కావాలని అన్నారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం