శనీశ్వర జయంతి - సి.హెచ్.ప్రతాప్
 శ్లో:
ఓం నీలాంజన సమాభాసం..
రవిపుత్రం యమాగ్రజం..
ఛాయామార్తాండ సంభూతం..
తం నమామి శనైశ్చరం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోయి అన్ని రకాల వ్యాధులు లేదా శారీరక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతాడు అని శాస్త్రం చెబుతోంది.హిందూ మత విశ్వాసాల ప్రకారం, శని జయంతిని ప్రతి ఏడాది వైశాఖ, జ్యేష్ఠ అమావాస్య రోజున రెండు సార్లు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జ్యేష్ఠ అమావాస్య తిథి జూన్ 5వ తేదీ బుధవారం రాత్రి 7:54 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు అంటే 6 జూన్ 2024 గురువారం నాడు సాయంత్రం 6:07 గంటలకు ముగుస్తుంది.హిందూమతంలో శని జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీన్నే 'శని అమావాస్య' అని కూడా అంటారు. శని దేవుడు సూర్యభగవానుడు, ఛాయా దేవిల కుమారుడు. శనిదేవుడిని కర్మఫలాదత అని కూడా అంటారు.నీశ్వరుని జన్మదినాన్ని గంగానదిలో స్నానం చేసి జరుపుకోవడం ఆనవాయితీ. దీనితో పాటు ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా చదవడం ద్వారా కూడా శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు. శనిగ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి భక్తులు శని శాంతి, శని జపం వంటి పూజలు చేయడం ద్వారా ఆయన ఆశీర్వాదం పొందుతారు. శనివారం రోజున ఉపవాసం ఉండి శని దేవుడిని పూజించాలి.వైశాఖ అమావాస్య రోజున అతి పవిత్రమైన శనిజయంతి. ఈ సందర్భంగా ఆ స్వామిని భక్తిశ్రద్ధలతో కొలచుకునేందుకు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి. శనికి తైలాభిషేకం అంతే ప్రీతి. అందుకని సమీపంలో ఉన్న శనీశ్వరుని విగ్రహానికి నువ్వులనూనెతో తైలాభిషేకం చేయాలి. ఆయన ముందర నువ్వులు లేదా ఆవనూనెతో వెలిగించిన దీపాన్ని ఉంచాలి. శనికి సంబంధించిన జపతపాలు, హోమాలు చేయడానికి ఇది విశిష్టమైన రోజు అని చెప్పబడుతోంది. . 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం