ఓటే వజ్రాయుధం ; - :గుండాల నరేంద్ర బాబు
ఓటు వేయి తమ్ముడా ఆ ఆ...
లేటు చేయకు చెల్లెలా ఆ ఆ...
ఓటు వేయి తమ్ముడా ఆ ఆ...
లేటు చేయకు చెల్లెలా ఆ ఆ...
ప్రజాస్వామ్య రక్షణకై నడుం కట్టు సోదరా 
ఓటు వేయి తమ్ముడా ఆ ఆ...
లేటు చేయకు చెల్లెలా ఆ ఆ...
ప్రజాస్వామ్య రక్షణకై నడుం కట్టు సోదరా
ఆ ఆ ఆ  ఓ ఓ ఓ...
ఓ హో  ఓ ఓ...
అన్యాయం అక్రమాలే ఇంక సహించ వద్దురా 
ఆ ఆ ఆ...
అవినీతి బంధుప్రీతి దరికి రానీయొద్దురా 
ఆ ఆ ఆ...
అన్యాయం అక్రమాలే ఇంక సహించ వద్దురా
అవినీతి బంధుప్రీతి దరికి రానీయొద్దురా
నోటు వద్దు బాటిలొద్దు 
ఫుడ్డు వద్దు  గిఫ్ట్ లొద్దు 
నీతిగ నువ్వుండరా 
జాతి వెలుగు నీవురా 
ఆ ఆ ఆ ఓ ఓ ఓ...
ఓ ఓ ఓ...
ఆ పార్టీ ఈ పార్టీ 
అని తేడాలే చూడక 
నీకు నచ్చిన మంచి వారు 
నీకు మేలు చేయు వారు 
వుంటే ఓటేయరా లేదా నోటా కేయరా 
లేదా నోటా కేయరా 
రాజ్యాంగం ప్రకారం పాలించే నాయకులకే 
పాలించే నాయకులకే 
నీకు నచ్చిన మంచి వారు 
నీకు మేలు చేయు వారు
వుంటే ఓటేయరా లేదా నోటా కేయరా 
వుంటే ఓటేయరా 
లేదా నోటా కేయరా
ఓటు వేయి తమ్ముడా
లేటు చేయకు చెల్లెలా
ప్రజాస్వామ్య రక్షణకై నడుం కట్టు సోదరా
ఆ ఆ ఆ  ఓ ఓ ఓ...
నా దేశం నా రాష్ట్రం 
నా దేశం నా రాష్ట్రం 
నాదేనని భావించి
నాదేనని భావించి
జన జాగృతి కలిగించి 
దేశ భక్తి రగిలించి
దేశ భక్తి రగిలించి
ప్రతి ఒక్కరు ఓటువేసి 
తమ బాధ్యత నెరవేర్చి 
తమ బాధ్యత నెరవేర్చి
ధీరుడై ఓటరుండాలీ 
దారుణాల నరికట్టాలీ 
ఓటు మహిమే చూపించాలి 
నోట్ల పంపిణీ ఆపించాలి 
ఓటే వజ్రాయుధం 
ఓటే వజ్రాయుధం 
ఓటే వజ్రాయుధం
ఓటే వజ్రాయుధం
ఓ ఓ ఓ ఓ...
విశ్వ జ్ఞానమా... విశాల హృదయమా....
భారత రాజ్యాంగ సృజన శీలుడా...
అభినవ బుద్ధా అంబేద్కరుడా...
అందుకో జై భీము లందుకో బాబా 
అందుకో జై భీము లందుకో బాబా 
'మహాత్మా 'ఫూలే ప్రియ శిష్యుడా...
'భారత రత్న' యశోభూషణుడా 
ఓ ఓ మనువాదులకే వణుకు పుట్టించిన వాడా
మట్టి మనుషులకూ ఓటు హక్కు కల్పించిన వాడా 
వడ గాడ్పులే భరిస్తాం 
వడ దెబ్బలే సహిస్తాం 
ఉక్క పోత వరిస్తాం 
హక్కుల్ని సాధిస్తాం 
నిశ్చయంగ నిర్భయంగ మా ఓటే వేసేస్తాం
నిశ్చయంగ నిర్భయంగ మా ఓటే వేసేస్తాం
మా ఓటే వేసేస్తాం 
=====================
అను సృజన :
గుండాల నరేంద్రబాబు 
తెలుగు సాహిత్య పరిశోధకులు 
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, తేది :11-05-2024
సెల్ :9493235992


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం