రత్నమాల వచ్చింది
రత్నాలు కొన్ని తెచ్చింది
రంగులరాట్నం ఎక్కింది
గిర గిరా తిరిగింది !!
రత్నాలన్నీ ఓళికాయి
నేల మీద రాలై
పిల్లలంతా కూడారు
రత్నాలన్నీ ఏరారు !!
పల్లేరములో పోశారు
పాప చేతికి ఇచ్చారు
పాపా చూసి మురిసింది
చాప మీద పెట్టింది !!
అమ్మ వచ్చి చూసింది
సోది దారం తెచ్చింది
రత్నాల మాల గుచ్చింది
రత్నక్క మెడలో వేసింది !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి