రాజుల వేట! అచ్యుతుని రాజ్యశ్రీ

 "తాతా! మనం చెట్లపెంపకం అటవీ సంరక్షణ జూపార్క్ లకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం? పూర్వం బ్రిటిష్ వారి కాలంలో గూడా వేటాడే వారు .మంచె వేసి చెట్టు కింద మేక దున్నపోతు ని కట్టి వేటగాడు పెద్ద తుపాకీ తో చెట్టు మంచెలో కూచునేవాడని చదివాను" అడిగాడు శివా! దానికి తాత ఇచ్చిన జవాబు ఇది" అవును.ఆనాడు రాజులు వినోదం కోసం కాక వాతావరణ సమతుల్యత కోసం వేట కి వెళ్లేవారు.కేవలం జంతువులను చంపడం కోసం కాదు.దానికో నియమం కూడా ఉండేది.అనవసరంగా ఏప్రాణినీ హింసించరాదు.అది క్షత్రియ ధర్మం.రామాయణ భారతాల్లో మృగయావినోదం ఉంది.జింకలు లేళ్లు దుప్పి కుందేళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతే అవి పైరుపంటలను నాశనం చేస్తాయి.ఆహారధాన్యాల కొరత ఏర్పడుతుంది.అందుకే వాటిని వేటాడే వారు.వాటి సంఖ్య పెరగకుండా పులి సింహం మొదలైన క్రూర మృగాలు వాటిని చంపితిని అడవులు పర్యావరణ పరిరక్షణ కావించాయి.అనవసరంగా అన్యాయం గా వేటాడే రాజులు శిక్ష అనుభవించారుతెలిసీ తెలీక చంపి.దానికి ఉదాహరణ దశరథుడు జింక అనుకుని శ్రవణ కుమారుడు అనే మునిబాలకుని చంపి పుత్రవియోగంతో మరణించాడు.పాండురాజు హరిణి రూపంలో క్రీడిస్తున్న కిందమ ఋషి ఆయన భార్య పై బాణం వేసి శాపం పొందాడు.రామలక్ష్మణులు రాక్షసులను చంపారు కానీ అనవసరంగా మృగాలను చంపలేదు.మారీచుడు బంగారు లేడి రూపంలో వచ్చాడు.పాండవులు ఒకేచోట వనవాసం చేయలేదు.కొన్నాళ్లు ఒక ప్రాంతం లో ఉండి వేటకి వెళ్లేవారు.జానపదులు దీనికోకారణం చెప్పారు.వారికి హరిణాలు కలలో కనపడి " మాసంఖ్య తగ్గిపోతోంది.మీరు ఇంకో అడవికి వెళ్ళి పోండి" అని విన్నవించేవిట! దానివల్ల పులులు క్రూర మృగాలు ఆహారం కోసం ఊళ్ళమీద పడతాయి కదా!? జింక కుందేళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతే గడ్డి గాదం తినేయటమే గాక పైరు పంటలను నాశనం చేస్తాయి. అందుకే క్రూర మృగాలు ఉంటే అడవులు బాగా పెరుగుతాయి.వైదిక పరంపరానుసారం రుద్రుడు మృగం( జింక) పై బాణం వేసి ఆకాశంలో అలా స్థిరంగా ఉంచాడు.మృగం అంటే బ్రహ్మ.మృగీ అంటే బ్రహ్మ సృష్టించిన స్త్రీ మూర్తి.దీని అంతరార్థం ఏమంటే చంచలమైన మనస్సు అనే మృగంనియోగం ద్వారా నియంత్రణ చేయడం.ఇలా కంట్రోల్ లో ఇంద్రియాలు ఉంచాలి అని కథల ద్వారా చెప్పారు.భయభీతురాలైన మృగి శివుని హస్తం లో ఉంది.
దుష్యంతుడు వేటకి వెళ్లి  శకుంతల ను చూశాడు.వారి కొడుకు భరతుడు.అతనిపేరు మీద మనదేశం కి భారతదేశం అని పేరు వచ్చింది.ఇలా రాజులు వేట అన్నీ కూడా మృగయావినోదం అనేపేరు తో అటవీ సంరక్షణ కి దారితీశాయి 🌷
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం